కరోనా భయం..భయం : పాన్ మసాలా బ్యాన్

  • Published By: madhu ,Published On : March 25, 2020 / 03:29 PM IST
కరోనా భయం..భయం : పాన్ మసాలా బ్యాన్

ఏ దేశం చూసినా కరోనా వైరస్ తో భయంతో వణికిపోతోంది. ప్రపంచాన్ని ఈ వైరస్ వణికిస్తోంది. వేలాది సంఖ్యలో ప్రజలు చచ్చిపోతున్నారు. భారతదేశంలో కూడా ఈ వైరస్ ప్రభావితం చూపెడుతో్ంది. వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. పది మంది దాక మృతి చెందినట్లు సమాచారం. 21 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తున్నట్లు 2020, మార్చి 24వ తేదీ మంగళవారం రాత్రి ప్రధాన మంత్రి మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే.

పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. కరోనా వైరస్ అరికట్టడానికి 2020, మార్చి 25వ తేదీ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పాన్ మసాల నుంచి వస్తుందోమోనని..దీనిని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు యూపీలోని ఆహారభధ్రతా శాఖ ఆర్డర్స్ జారీ చేసింది. పాన్ మసాలాలు తయారు చేసే కంపెనీలు, వాటిని విక్రయించే షాప్స్ వెంటనే మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ బ్యాన్ మాత్రం నిరవధికంగా ఉంటుందని, తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిషేధం కంటిన్యూ అవుతుందని తెలిపింది. ఒకవేళ మసాలను తయారు చేసినా..అమ్మినా..నిలువ చేసినా..కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. పాన్ తిని ఎక్కడ పడితే..అక్కడ ఉమ్మి వేస్తున్నారని, దీని ద్వారా కరోనా వైరస్ వ్యాపిస్తుందని అక్కడి ప్రభుత్వం భావించి ఈ నిర్ణయం తీసుకుంది. 

Also Read | 2.3లక్షల కోట్ల కరోనా ప్యాకేజీని కేంద్రం ప్రకటించే అవకాశం