UP Election 2022 : బీజేపీకి షాక్‌‌లు…ఉత్సాహంలో సమాజ్‌‌వాది పార్టీ

యోగి కేబినెట్‌ నుంచి వైదొలగిన కొంతమంది నేతలు ఓబీసీకి చెందిన వారే కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంక్‌ బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే...

UP Election 2022 : బీజేపీకి షాక్‌‌లు…ఉత్సాహంలో సమాజ్‌‌వాది పార్టీ

Up Bjp

Uttar Pradesh BJP : యూపీలో కొద్ది రోజుల్లో ఎన్నికలు జరిగే క్రమంలో..బీజేపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఆ పార్టీకి వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు గుడ్ బై చెబుతున్నారు. ఇప్పటికే ఇద్దరు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా…2022, జనవరి 13వ తేదీ గురువారం మరో ఎమ్మెల్యే పార్టీ నుంచి జంప్ అవుతున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి స్వామి ప్రసాద్ మౌర్యనే తమ నాయకుడు అని ప్రకటించడం విశేషం. యూపీలో మొత్తం రాజీనామా చేసిన వారి ఎమ్మెల్యేల సంఖ్య ఏడుకి చేరింది.

Read More : Akhanda : మల్టీప్లెక్స్‌లో మాస్ జాతర.. ఏఎమ్‌బి సినిమాస్‌లో ‘అఖండ’ అరాచకం..

ప్రతిపక్ష సమాజ్ వాదీ పార్టీతో జత కడుతున్నారు. దీంతో విపక్షంలో ఉన్న ఎస్పీకి బలం అంతకంతకూ పెరుగుతోంది. యోగి పాలనపై వ్యతిరేకతతో పాటు రైతు ఉద్యమం సందర్భంగా బీజేపీ చేసిన తప్పిదాలు తమ కొంప ముంచుతాయని మంత్రులు, ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లుగా సమాచారం. అందుకే కాషాయ పార్టీని వీడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే పదవులకు రాజీనామా చేసేందుకు తమదైన శైలిలో వారు కారణాలు వెతుక్కుంటున్నారు. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేల రాజీనామాల వ్యవహారం బీజేపీకి ఎదురుదెబ్బగా మారిపోతోంది. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీలో ఉత్సాహం అంతకంతకూ పెరుగుతోంది.

Read More : UP Election: యూపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. సామాన్యులకే సీట్లు.. ఉన్నావ్ బాధితురాలి తల్లికి టిక్కెట్!

యోగి కేబినెట్‌ నుంచి వైదొలగిన కొంతమంది నేతలు ఓబీసీకి చెందిన వారే కావడంతో ఆ వర్గం ఓటు బ్యాంక్‌ బీజేపీకి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వచ్చే నెలలోనే ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న దృష్టా బీజేపీకి ఇది గట్టి ఎదురు దెబ్బ అని అంటున్నారు విశ్లేషకులు. నిజానికి 2017లో దళితులు, ఓబీసీల మద్దతుతోనే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఓబీసీ మంత్రులు వరుస పెట్టి కాషాయ పార్టీని వీడడంతో ఏం చేయాలో అర్ధంకాని పరిస్థితుల్లో యోగి ఉన్నారని తెలుస్తోంది. మరి రాజీనామాల పర్వాలకు బీజేపీ ఎలా చెక్ పెడుతుందో చూడాలి.