UP Budget 2023: మౌలికరంగానికి యోగి సర్కార్ పెద్దపీట.. రూ.6.90 లక్షల కోట్లతో 2023-24 బడ్జెట్

UP Budget 2023: ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రవేశ పెట్టారు. యోగి 2.0 ప్రభుత్వానికి ఇది రెండవ బడ్జెట్. కాగా, తాజా బడ్జెట్‭లో మౌలిక రంగానికి యోగి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. కేంద్ర బడ్జెట్ సైతం ఈ యేడాది మౌలిక రంగానికి పెద్ద పీట వేసింది. అదే బాటలో యోగి ప్రభుత్వం కూడా పయనిస్తున్నట్లు కనిపిస్తోంది. మొత్తం 6.90 లక్షల కోట్లతో ప్రవేశ పెట్టిన బడ్జెట్‭లో అధికశాతం కేటాయింపులు మౌలిక రంగానికే కేటాయించారు.

Mallikarjun Kharge: 100 మంది మోదీలు, అమిత్ షాలు వచ్చినా ఇక కాంగ్రెస్‭ గెలుపును ఆపలేరట

ఇక బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి సురేశ్ కుమార్ ఖన్నా మాట్లాడుతూ ‘‘ఇది యువతను రైతుల్ని బలోపేతంగా తీర్చిదిద్దే బడ్జెట్. అలాగే మహిళలకు గౌరవనీయమైన బడ్జెట్. ఈ బడ్జెట్‭లో మౌలిక రంగానికి అధిక ప్రాధాన్యం కల్పించాం. ఇది రాష్ట్రాలోని యువతకు ఉద్యోగ కల్పనకు బూస్ట్ ఇస్తుంది. ఇక ఈ బడ్జెట్ ‘నూతన ఉత్తర ప్రదేశ్’ రాష్ట్రాన్ని నిర్మిస్తుందని ఆశిస్తున్నాను. బడ్జెట్ కంటే ముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాత్ చెప్పినట్లు.. ఈ బడ్జెట్ రాష్ట్రంలో చారిత్రాత్మకంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు.

యూపీ బడ్జెట్‭లో కొన్ని కీలక అంశాలు

? రెండు కొత్త లింక్ ఎక్స్‌ప్రెస్‌వేలు (ఝాన్సీ లింక్ ఎక్స్‌ప్రెస్ వే మరియు చిత్రకూట్ లింక్ ఎక్స్‌ప్రెస్ వే) కోసం రూ.235 కోట్లు కేటాయింపు.

? సీఎం సామూహిక వివాహ పథకం కింద జనరల్ కేటగిరీ బాలికలకు రూ.600 కోట్లు, ఓబీసీ బాలికల వివాహానికి రూ.150 కోట్లు కేటాయింపు.

? గ్రామీణ మహిళల సాధికారత కోసం స్వయం సహాయక సంఘాలకు రూ.83 కోట్లు ప్రతిపాదించారు.

? నిరుపేద వితంతువులకు సహాయం అందించేందుకు రూ.4032 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం రాష్ట్రంలో దాదాపు 32.62 లక్షల మంది మహిళలకు సహాయం అందజేస్తున్నారు.

? మీరట్ నుండి ప్రయాగ్‌రాజ్ వరకు కొత్త 594 కి.మీ పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వే కోసం రూ.36,230 కోట్లు ప్రతిపాదించారు.

? 14 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి రూ.2491 కోట్ల నిధిని కేటాయించారు.

? గోరఖ్‌పూర్ లింక్ ఎక్స్‌ప్రెస్‌వేతో పాటు పారిశ్రామిక కారిడార్‌ను అభివృద్ధి చేసేందుకు రూ.200 కోట్లు ప్రతిపాదించారు.

? ఫార్మా పార్కులకు రూ.25 కోట్లు, యూపీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఏర్పాటుకు రూ.20 కోట్లు, నర్సింగ్ కాలేజీల ఏర్పాటుకు రూ.26 కోట్లు కేటాయించారు.

? కొత్త రోడ్లు, ఫ్లై ఓవర్ల నిర్మాణానికి రూ.21,159 కోట్లు కేటాయించారు. కాగా, ఇప్పటికే ఉన్న వాటి నిర్వహణకు మరో రూ.6209 కోట్లు ప్రతిపాదించారు. గ్రామీణ రహదారులకు రూ.1525 కోట్లు, చక్కెర మిల్లులకు వెళ్లే రహదారుల విస్తరణకు రూ.250 కోట్లు ప్రభుత్వం కేటాయించదారు. ఇండస్ట్రియల్, లాజిస్టిక్ పార్కులకు వెళ్లే రోడ్ల విస్తరణకు మరో 50 కోట్లు కేటాయించారు.

? 2022 అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ యొక్క జన్ లోక్ కళ్యాణ్ సంకల్ప పత్రానికి అనుగుణంగా, ప్రైవేట్ గొట్టపు బావులకు 100 శాతం విద్యుత్ టారిఫ్ మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ.1500 కోట్లు ప్రతిపాదించారు. 2022-23 బడ్జెట్‌లో ఇది సగం ఉండేది.

? సోలార్ ప్లాంట్ల నుంచి శక్తిని వెలికితీసేందుకు, బదిలీ చేయడానికి బుందేల్‌ఖండ్‌లో రెండవ దశ గ్రీన్ ఎనర్జీ కారిడార్ ఏర్పాటుకు రూ.1554 కోట్లు ప్రతిపాదించారు. వచ్చే మూడేళ్లలో పథకాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం.

? ఉత్తరప్రదేశ్ వార్షిక బడ్జెట్ పరిమాణం 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ. 6.90 లక్షల కోట్లుగా నిర్ణయించారు. గత బడ్జెట్ తో (రూ. 6.15 లక్షల కోట్లు) 16.8 శాతం పెరుగుదల.

? ఇక ఆర్థిక లోటు రూ. 84,883 కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. ఇది అంచనా వేసిన రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో 3.84 శాతం.

ట్రెండింగ్ వార్తలు