Told to ‘go die’..కరోనా వచ్చిందా?అయితే ఛస్తే..చావు మాకేంటీ..బాధితుడికి హెల్ప్ లైన్ సిబ్బంది సమాధానం

Told to ‘go die’..కరోనా వచ్చిందా?అయితే ఛస్తే..చావు మాకేంటీ..బాధితుడికి హెల్ప్ లైన్ సిబ్బంది సమాధానం

Up Helpline Team Told To 'go Die'

UP helpline team told to ‘go die’ : కరోనా వచ్చిందని తెలియగానే ఆమడదూరం పారిపోతున్నాం. పక్కనున్నవాళ్లు తుమ్మినా..దగ్గినా అనుమానంగా చూస్తూ అంటరానివారిని చూసినట్లుగా దూరంగా జరిగిపోతున్నాం. ఈ కరోనా కాలంలో పరిస్థితులు అంత్యంత దారుణంగా ఉన్నాయి. మానవత్వాన్ని కూడా చంపేస్తున్నాయి. కరోనా వస్తే ఈ నంబర్ కు సంప్రదించండీ అంటూ రాష్ట్రాలు కొన్ని హెల్ప్ లైన్ నంబర్లను ఇచ్చాయి. ఈనంబర్లలో సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉంటారని ప్రకటించాయి. కానీ ఈ హెల్ప్ లైన్ నంబర్లలో సిబ్బంది ఎంత వరకూ సక్రమంగా..బాధితుల ఫోన్లకు స్పందిస్తున్నారు? అంటూ ఆలోచించాల్సిన పరిస్థితి. దీనికి ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తోంది
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో కరోనా బాధితుల విషయంలో వైద్య సిబ్బంది కఠినంగా వ్యవహరించిన ఉదంతం గురించి తెలిస్తే..

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కరోనా బాధితులకు మరింత మెరుగైన వైద్యం అందించేందుకు.మెడిసిన్స్ ను బాధితుల ఇంటికే చేరవేసే ఏర్పాటు చేసింది. ఇందుకోసం కరోనా వైరస్ కమాండ్ సెంటర్ ప్రారంభించారు. దాని కోసం ఒక హెల్పలైన్ పోన్ నంబర్ కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. కానీ హెల్ప్ లైన్ సిబ్బంది వ్యవహారం మాత్రం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది.

లక్నోకి చెందిన సంతోష్ కుమార్ గత శనివారం (ఏప్రిల్ 10,2021) తన భార్యతో పాటు కరోనా టెస్టు చేయించుకున్నారు. ఇద్దరికీ పాజిటివ్ వచ్చింది. దీంతో ఇద్దరూ హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ క్రమంలో సంతోష్ కుమార్… హెల్ప్ లైన్‌కు ఫోన్‌చేసి కరోనా సోకిన వారికి ప్రభుత్వం ఇచ్చే మెడిసిన్స్ గురించి హెల్ప్ లైన్ సిబ్బందికి ఫోన్ చేసి తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం హెల్ప్ లైన్ నంబర్ కు ఫోన్ చేశాడు. దానికి సిబ్బంది ఇచ్చిన సమాధానం షాక్ కు గురించేసింది.

సంతోష్ కుమార్ ఫోన్ చేసి మెడిసిన్స్ వివరాలు కనుక్కోగా.. హెల్ప్ లైన్ సిబ్బంది ఐసోలేషన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పారు. దీంతో సంతోష్ తనకు ఆ యాప్ గురించి తెలియదని చెప్పాడు. వెంటనే అటువైపు నుంచి ‘‘ఏమీ తెలీదా?‘అయితే చస్తే చావు‘ మాకేంటీ. మాకు ఫోన్ చేసి విసిగిస్తున్నావు’’అంటూ నిర్లక్షపు సమాధానం చెప్పేసరికి సంతోష్ కుమార్ షాక్ అయ్యాడు. దీంతో ఆవేదనతో సంతోష్ కుమార్ వెంటనే యూపీ సీఎంకు, జిల్లా అధికారులకు లేఖ రాశారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటువంటి సమయంలో కనీసం మర్యాద కూడా లేకుండా ప్రవర్తించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరాడు.