Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. ఎనిమిది మంది మృతి..

ఉత్తరప్రదేశ్‌‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భవనం పైకప్పు కూలడంతో అందులో పనిచేస్తున్న ఎనిమిది మంది మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి సహాయక చర్యలు చేపట్టడంతో 11 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు.

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. ఎనిమిది మంది మృతి..

Uttarpradesh

Uttar Pradesh: ఉత్తరప్రదేశ్‌‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీ భవనం పైకప్పు కూలడంతో అందులో పనిచేస్తున్న ఎనిమిది మంది మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ సిబ్బంది రంగంలోకిదిగి సహాయక చర్యలు చేపట్టడంతో 11 మంది సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే, నాలుగు నుంచి ఐదు మంది ఉన్న కుటుంబం ఇంకా కనిపించలేదని, వారు శిథిలాల కింద చిక్కుకొని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు కోల్డ్ స్టోరేజీ ఘటనకు బాధ్యులైన నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు ప్రధాన నిందితులు ఇంకా పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

Crime News: ధాబాలోని ఫ్రీజర్ లో యువతి మృతదేహం లభ్యం.. ఆమెను ప్రేమించిన వ్యక్తి అరెస్ట్

యూపీలోని సంభాల్ జిల్లా చందౌసి ప్రాంతం ఇస్లాం నగర్ రోడ్డులో ఉన్న ప్రైవేట్ కోల్డ్ స్టోరేజీలో ఈ ఘటన చోటు చేసుకుంది. కూలిపోయిన కోల్డ్ స్టోరేజీ పైకప్పు భాగాన్ని మూడు నెలల క్రితం నిర్మించారు. అయితే, దీని నిర్మాణంకు ఎలాంటి అనుమతులు తీసుకోలేదు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీశామని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని మొరాదాబాద్ డీఐజీ శలభ్ మాథుర్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటి వరకు 11 మందిని సురక్షితంగా శిథిలాల నుంచి కాపాడారు. వారిలో కొందరికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అమ్మోనియా గ్యాస్ సిలిండర్లను కోల్డ్ స్టోరేజీలో ఉంచడం వల్ల సహాయ చర్యల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుందని సహాయ సిబ్బంది తెలిపారు.

Crime News: హైదరాబాద్‌లో నడిరోడ్డుపై హత్య చేసిన ముగ్గురు దుండగులు.. భయంతో పరుగులు తీసిన స్థానికులు

ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ చేసింది. సంభాల్ జిల్లా చందౌసిలో కోల్డ్ స్టోరేజిలో జరిగిన ప్రమాదంపై సీఎం యోగి ఆధిత్యనాథ్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపింది. ఘటనపై సీఎం దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్ లో పేర్కొంది.