UP Election : అఖిలేశ్ విఫలం కావడానికి కారణాలు ఏంటీ ?

అలాగే అనేక పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్పీ మిత్ర పక్షాలకు భారీగా సీట్లు కేటాయించింది. అదే సమయంలో కాంగ్రెస్, బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడంతో

UP Election : అఖిలేశ్ విఫలం కావడానికి కారణాలు ఏంటీ ?

Akhilesh Yadav

Uttar Pradesh Election 2022 Akhilesh Yadav Failed : ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో అధికారం చేపట్టాలన్న ఎస్పీ ఆశలు అడియాశలయ్యాయి. ప్రజలు ఆదరించకపోవడంతో మ్యాజిక్ ఫిగర్ ను చేరుచుకోలేకపోయింది. ఈ రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారం చేపట్టే దిశగా దూసుకెళుతోంది. భారీ ఓటు షేర్ సాధించింది. అయితే.. గత ఫలితాల కంటే సమాజ్ వాదీ పుంజుకుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటి నుంచి ఎస్పీ వ్యూహాత్మకంగా ముందుకెళ్లింది. బీజేపీకి సంబంధించిన కీలక నేతలను ఆకర్షించింది. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్పీలో చేరిపోయారు. దీంతో యూపీలో ఎస్పీ.. బీజేపీకి షాక్ ఇస్తుందా అనే అనుమానాలు కలిగాయి. కానీ.. ప్రజలు మరోసారి బీజేపీని ఆదరించారు.

Up Sp Akhilesh

Up Sp Akhilesh

Read More : Uttar Pradesh 2022 : యూపీ నా అడ్డా అంటున్న యోగీ.. మెజార్టీకి 15 పాయింట్స్

ఇక అఖిలేశ్ విషయానికి వస్తే…

గత ఎన్నికలతో పోలిస్తే…ఈ సారి కాస్త బలపడినప్పటికీ..మరోసారి అధికారం అందుకోవాలన్న ఎస్పీ ఆశలు అడియాసలయ్యాయి. అఖిలేశ్ నాయకత్వం బలంగా లేకపోవడం, ఐదేళ్ల కాలంలో బలమైన ప్రతిపక్షనేతగా తన మార్క్ చూపించలేకపోవడం, ములాయంసింగ్ యాదవ్ చురుగ్గా లేకపోవడం, అంతర్గత కుమ్ములాటలు, అఖిలేశ్ సొంత మరదలు ఎన్నికలకు రెండునెలల ముందు బీజేపీలో చేరడం వంటివి ఎస్పీ ఓటు బ్యాంకును దెబ్బతీశాయి.

Akhilesh

Akhilesh

Read More : UP Congress : ప్చ్ ప్రియాంక..! కాంగ్రెస్ ఓటమికి కారణాలివే..!

అలాగే అనేక పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసిన ఎస్పీ మిత్ర పక్షాలకు భారీగా సీట్లు కేటాయించింది. అదే సమయంలో కాంగ్రెస్, బీఎస్పీ ఒంటరిగా పోటీ చేయడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు బ్యాంకు చీలిపోయింది. ఇక సరిగ్గా ఎన్నికలకు ముందే అఖిలేశ్ సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం, పెర్‌ఫ్యూమ్ వ్యాపారి పీయూష్ జైన్ దగ్గర దాదాపు 200 కోట్ల విలువైన డబ్బు, బంగారం దొరకడం ఎస్పీపై వ్యతిరేకతను పెంచాయి. అలాగే రైతులు, ఇతర వర్గాల ప్రజలకు నమ్మకం కలిగించడంలోనూ అఖిలేశ్ విఫలమయ్యారు.

Read More : Modi- Yogi : యూపీలో చరిత్ర తిరగరాసిన బీజేపీ.. మోదీ-యోగీ డబుల్ ధమాకా

1. అంతర్గత కుమ్ములాటలు
2. అఖిలేశ్ నాయకత్వం బలంగా లేకపోవడం
3. ములాయం సింగ్ యాదవ్ చురుగ్గా లేకపోవడం
4. సొంత మరదలు పార్టీ నుంచి వెళ్లిపోవడం
5. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోవడం

Akhilesh

Akhilesh

Read More : Election Results 2022: బీజేపీ ఆధిక్యం.. యూపీలో సెంచరీ దాటిన కమలం

6. బలమైన ప్రతిపక్షనేతగా ప్రభావం చూపలేకపోవడం
7. మిత్రపక్షాలకు భారీగా సీట్ల కేటాయింపు
8. అఖిలేశ్ సన్నిహితులపై ఐటీ దాడులు
9. రైతులు, ఇతర వర్గాల ప్రజలకు నమ్మకం కలిగించలేకపోవడం
10. బీజేపీ హిందుత్వ ఎజెండాను తిప్పికొట్టలేకపోవడం