Uttar Pradesh Election : అఖిలేష్ తీసుకెళ్లే ఎర్రటి మూటలో ఏముంది ? ప్రమాణం ఎందుకు ?

చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రచార కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. బీజేపీ పార్టీలపై పంచ్ లు విసురుతున్నారు. అయితే.. ఆయన ఎక్కడికెళ్లినా..

Uttar Pradesh Election : అఖిలేష్ తీసుకెళ్లే ఎర్రటి మూటలో ఏముంది ? ప్రమాణం ఎందుకు ?

Up Election 2022

Akhilesh Yadav Takes Out A Red Pouch : ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ కు టైం దగ్గర పడుతోంది. దీంతో నేతలు ఫుల్ టెన్సన్ లో ఉన్నారు. ఓటర్లను ఆకట్టుకొనేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. యూపీపైనే ప్రధాన ఫోకస్ ఉంటుంది. ఈ సారి జరిగే ఎన్నికలు దేశంపై ప్రభావం చూపిస్తాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అధికార పార్టీలో ఉన్న బీజేపీ ఢీకొట్టేందుకు ఎస్పీ సర్వశక్తులు వడ్డుతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలను బుట్టలో వేసుకుంది.

Read More : Covid HIV Patient : కరోనా సోకిన ఆ HIV పేషెంట్ శరీరంలో ఏకంగా 21 మ్యుటేషన్లు.. అధ్యయనంలో తేల్చిన సైంటిస్టులు..!

చిన్న చిన్న పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రచార కార్యక్రమాలను హోరెత్తిస్తున్నారు. బీజేపీ పార్టీలపై పంచ్ లు విసురుతున్నారు. అయితే.. ఆయన ఎక్కడికెళ్లినా.. ఓ చిన్నపాటి ఎర్రటి సంచిని తీసుకెళుతుండడం అందరి దృష్టిని ఆకర్షించింది. అసలు ఆ ఎర్రటి మూటలో ఏముంటుంది ? అనే చర్చ స్టార్ట్ అయ్యింది. ప్రచారానికి వెళుతున్నారు కదా.. వారి నమ్మకాలను బట్టి పూజలు చేసిన సంచి కావొచ్చు అని కొందరు అనుకున్నారు. దీనిపై ఉన్న అనుమానాలను నివృత్తి చేశారు అఖిలేష్ యాదవ్. ఘజియాబాద్ లో ఎన్నికల ప్రచారానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. మూటపై చర్చకు వచ్చింది. ఆ మూట రహస్యాన్ని అఖిలేష్ వెల్లడించారు. ఈ మూటలో అన్నం ఉందని, బీజేపీని ఓడించేంత వరకు పోరాటం ఆపబోమని ఈ అన్నంపై ప్రమాణం చేసినట్లు తెలిపారు. తమ నేతలతో కూడా ఈ మూటపై ప్రమాణం చేయిస్తున్నట్లు ఆయన తెలపడంతో మూట రహస్యం విడిపోయింది.

Read More : TRS Parliamentary Party : పార్లమెంట్ సెషన్స్, రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని టీఆర్ఎస్ నిర్ణయం

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావిస్తున్న ఈ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్నాయి. ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో నాలుగు బీజేపీ పాలిత రాష్ట్రాలే ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు పంజాబ్‌లోనూ విజయం సాధించి.. సార్వత్రిక సమరానికి సిద్ధమవ్వాలని కమలనాధులు భావిస్తుండగా బీజేపీని ఢీకొట్టేందుకు రాజకీయ పార్టీలు సిధ్దంగా ఉన్నాయి. 2022 మేలో ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ గడువు ముగుస్తుంది. మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరగనుంది. అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో గెలుపు బీజేపీకి అత్యవసరం. ఓ రకంగా యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ పాలనపై ప్రజలు ఇచ్చే తీర్పు.. సార్వత్రిక ఎన్నికల గమనాన్ని నిర్దేశించనుంది. యూపీలో నామినేటడ్ స్థానంతో కలిపి మొత్తం 404 అసెంబ్లీ స్థానాలున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ 202.

Read More : Punjab Congress : రాహుల్ పాకెట్‌‌ను ఎవరు దొంగిలించారు ? హర్ సిమ్రత్ కౌర్ ట్వీట్

–  మొత్తం స్థానాలు 404
 ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన స్థానాలు 202
 అధికారంలో బీజేపీ
 బీజేపీకి 303 స్థానాలు

Read More : Punjab Congress : రాహుల్ పాకెట్‌‌ను ఎవరు దొంగిలించారు ? హర్ సిమ్రత్ కౌర్ ట్వీట్

–  ఎస్పీకి 49 స్థానాలు
 బీఎస్పీకి 15 స్థానాలు
 కాంగ్రెస్‌కు 7 స్థానాలు
 ఒంటరిగా పోటీచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ
 మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఎస్పీ