UP Election 2022 : యూపీ బీజేపీ ఫస్ట్ లిస్ట్.. గోరఖ్ పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ

శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. గోరఖ్ పూర్ అర్బన్ స్థానం నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ చేయనున్నారు. తొలి దశ ఎన్నికల్లో 58 స్థానాలకు గాను 57 మంది...

UP Election 2022 : యూపీ బీజేపీ ఫస్ట్ లిస్ట్.. గోరఖ్ పూర్ అర్బన్ నుంచి యోగి పోటీ

Up Bjp

UP BJP First List Released : ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ? మరోసారి బీజేపీ అధికారం చేపడుతుందా ? సైకిల్ పార్టీ (సమాజ్ వాదీ పార్టీ) కాషాయదళానికి చెక్ పెడుతుందా అనే చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బీజేపీ పార్టీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎస్పీ పార్టీలో చేరిపోయారు. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా బీజేపీ తమ అభ్యర్థులను ఖరారు చేస్తోంది.

Read More : Acharya : మెగాస్టార్ ఫ్యాన్స్‌‌కు బ్యాడ్ న్యూస్.. ‘ఆచార్య’ విడుదల వాయిదా

2022, జనవరి 15వ తేదీ శనివారం తొలి జాబితాను విడుదల చేసింది. బీజేపీ ఫస్ట్ ఫేజ్‌కు సంబంధించి 57 మంది, సెకండ్‌ఫేజ్‌కు సంబంధించి 48 మంది అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది. బీజేపీ యూపీ ఇంచార్జీ ధర్మేంద్ర ప్రదాన్ జాబితాను విడుదల చేశారు. సీఎం యోగి గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దిగుతుండగా.. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మోర్య సిరటు నుంచి పోటీ చేయనున్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సిరతు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం 403 అసెంబ్లీ స్థానాలకు బీఎస్పీ పోటీ చేస్తోంది. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా బరిలోకి దిగుతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు పెట్టుకున్న బీఎస్పీ.. ఎన్నికల ఫలితాల అనంతరం పొత్తు విత్ డ్రా చేసుకుంది.

Read More : Chiranjeevi : హ్యాపీ ఎండింగ్.. చిరు, జగన్ భేటీపై నాగార్జున కామెంట్స్

నామినేటడ్ స్థానంతో కలిపి 404 అసెంబ్లీ స్థానాలున్నాయి.
ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ 202.
పోలింగ్ దశలు 7.
పోలింగ్ తేదీలు : ఫిబ్రవరి 10, ఫిబ్రవరి 14, ఫిబ్రవరి 20, ఫిబ్రవరి 23, ఫిబ్రవరి 27, మార్చి 03, మార్చి 07.

Read More : Bheemla Nayak : ‘భీమ్లా నాయక్’ కొత్త పోస్టర్ అదిరిందిగా..

2017లో బీజేపీ తిరుగులేని విజయం. బీజేపీకి ఇక్కడ 303 స్థానాలున్నాయి.
ఎస్పీకి 49 స్థానాలు.
బీఎస్పీకి 15 స్థానాలు.
కాంగ్రెస్‌కు 7 స్థానాలు.
ఒంటరిగా పోటీచేస్తున్న బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ.
మిత్రపక్షాలతో కలిసి పోటీచేస్తున్న ఎస్పీ.