Uttar Pradesh Lockdown : ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్.. ఎప్పటివరకంటే?

Uttar Pradesh Lockdown : ఉత్తరప్రదేశ్‌లో లాక్‌డౌన్.. ఎప్పటివరకంటే?

Uttar Pradesh Full Lockdown

Uttar Pradesh Full lockdown : కరోనా కేసులు పెరుగుతున్న వేళ ఉత్తరప్రదేశ్‌ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి (శుక్రవారం) రాష్ట్రంలో లాక్‌డౌన్‌ విధిస్తున్నట్లు ప్రకటించింది. శుక్రవారం (ఏప్రిల్ 30) రాత్రి నుంచి మే 4వ తేదీ ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని వెల్లడించింది.

గత కొంతకాలంలో ఉత్తరప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌ దొరక్కా పేషెంట్లు అల్లాడిపోతున్నారు. ఎలాగైనా కరోనాను నియంత్రించాలని యూపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం యూపీలో 3 లక్షలకు పైగా యాక్టివ్ కేసులున్నాయి. సుమారు 12 వేల మందికి పైగా ఉత్తరప్రదేశ్‌లో మృత్యువాత పడ్డారు. సెకండ్ వేవ్‌లో యూపీలో కేసులు పెరిగిపోతున్నాయి.