బులెట్ ఇస్తానని అపాచి బైక్ ఇస్తారా?..అంటూ ఊరేగింపులో బట్టలు విప్పేసి వరుడు హంగామా..పెళ్లి వద్దు పొమ్మన్న వధువు

బులెట్ ఇస్తానని అపాచి బైక్ ఇస్తారా?..అంటూ ఊరేగింపులో బట్టలు విప్పేసి వరుడు హంగామా..పెళ్లి వద్దు పొమ్మన్న వధువు

Uttar Pradesh Groom Marriage Bullet Bike Demand 

Uttar Pradesh groom marriage Bullet bike Demand  : పెళ్లిలో వరుడికి బైక్ ఇస్తాం. కారు ఇస్తాం, బంగారు గొలుసు పెడతాం అని వధువు తరపువారు మాట ఇవ్వటం చూస్తుంటాం. కానీ మాట ఇచ్చాక ఇవ్వకపోతే వరుడు ఏం చేస్తాడో చేసి చూపించాడో వరుడు. అత్తింటివారు ఏదో లాంఛనంగా ఇస్తానది ఇవ్వకపోతే సరిపెట్టుకుని పెళ్లి చేసుకుని కనీసం ఆ తరువాతైనా ఇవ్వండీ అని సర్ధుకుని పెళ్లి చేసుకునేవాళ్లను చూసి ఉంటాం. కానీ ఓ పెళ్లి కొడుకు మాత్రం పెళ్లి ఊరేగింపులో నానా హంగామా చేశాడు. ఏకంగా గుర్రం ఎక్కి ఊరేగింపుగా వస్తున్న వరుడు గుర్రంపైనుంచి దూకేసి పెళ్లి డ్రెస్ విప్పేసి నానా హంగామా చేశాడు. వరుడికి అత్తింటివారు అంటే వధువు తరపు వారు ‘బుల్లెట్’ బైక్ ఇస్తానని ‘అపాచి’ బైక్ ఇవ్వటంతో వరుడు పెళ్లి ఊరేగింపులో రచ్చ రచ్చ చేసిన ఘటన యూపీలోని హత్రాస్ సిటీలో జరిగింది.

యూపీలోని హత్రాస్ పట్టణంలోని అమర్‌పురఘనా ప్రాంతంలో ఒక వరుడు పెళ్లి ఊరేగింపులో ఆగ్రహంతో ఊగిపోయాడు. కట్నం కింద ఇస్తామన్న బులెట్ బదులు అపాచి బైక్ ఇవ్వటంతో కోపంతో ఊగిపోయాడు. ఏకంగా పెళ్లి అలకరణంతో గుర్రం మీద ఊరేగింపుగా వస్తున్న సమయంలో గుర్రంపై నుంచి దూకేశాడు. అక్కడితో ఊరుకోకుండా.. పెళ్లి దుస్తులను విప్పేసి నానా హంగామా చేశాడు. అది చూసిన వధువు తరపువారు కంగారుపడిపోయారు. బాబ్బాబూ తరువాత వీలు చూసుకుని ఇస్తాం బాబూ అల్లరి చేయకు మా పరువు పోతుందని బతిమాలుకున్నారు. కానీ అతని వినలేదు.

దీంతో ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియటంతో సంఘటనా స్థలానికి చేరుకుని వరునితోపాటు అతని తండ్రి, బంధువులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కౌన్సిలింగ్ ఇచ్చారు. కానీ పెళ్లికి ముందే వీరు అసలు రూపం బైటపడింది. పెళ్లి తరువాత నా కూతుర్ని వేధించేవారిలా ఉన్న ఈ పెళ్లి మాకు వద్దని వధువు తండ్రి తేల్చి చెప్పేశాడు. కేవలం బైక్ కోసం ఇంత రాద్దాతం చేసే ఇటువంటివాడికి నాకూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తే తరువాత ఇంకెన్ని రకాలుగా వేధిస్తాడోనని భావించాడు. దీంతో ఈ పెళ్లి ఇష్టం లేదంటూ తేల్చిచెప్పేశాడు. వధువు కూడా తండ్రికి సపోర్ట్ చేసింది. నా తండ్రిని ఇంతగా అవమానించినవాడిని పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పేసింది.

అలీగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువకుడు లక్నోలో పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతనికి హత్రాస్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహం నిశ్చయమయ్యింది. రూ. 10 లక్షల కట్నం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. అలాగే వరుడు తనకు బులెట్ వాహనం కావాలని కోరాడు. అయితే వధువు తరపువారు అపాచే బైక్ కొనుగోలు చేశారు. పెళ్లి వేడుక ప్రారంభమయ్యింది. వరుడు గుర్రం మీదకు ఎక్కి, ఊరేగింపుగా వధువు ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో అక్కడున్న వారెవరో వరునితో బులెట్ బదులు అపాచీ వాహనం కొన్నారని చెప్పారు.

ఈ మాట విన్నవెంటనే వరుడు ఆగ్రహంతో ఊగిపోతూ, గుర్రం మీద నుంచి దిగి, పెళ్లి దుస్తులు విప్పేసి, టీ షర్టు, ప్యాంటు ధరించి ఒక రూమ్ లోకి వెళ్లి కూర్చున్నాడు. దీనిని చూసిన పెళ్లివారంతా కంగారు పడిపోయారు. పెళ్లి కోలాహలమంతా ఆగిపోయింది. బులెట్ ఇవ్వకపోతే ఈ పెళ్లి జరగదంటూ వరుడు… వధువు తరపువారికి తెలిపాడు. ఈ విషయాన్ని వధువు తరపువారు పోలీసులకు తెలియజేశారు. మరోవైపు వధువు కూడా ఇటువంటి పెళ్లి కొడుకు తనకు అవసరం లేదంటూ తెగేసి చెప్పింది. ఇంతలో వివాహ ముహూర్తం కూడా దాటిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.