Uttar Pradesh : ఎన్‌కౌంటర్ చేయనని రాసిస్తేనే ఆస్పత్రికి వస్తా, లేకుంటే రాను.. పోలీసుల ముందు ఖైదీ హల్ చల్

ఎన్‌కౌంటర్ చేయనని రాసిస్తేనే ఆస్పత్రికి వస్తా.. లేకుండా రాను పోలీసులకు ఓ ఖైదీ షరతు పెట్టాడు. దీనికి కారణం యూపీలో నేరస్థుల్ని వరుస ఎన్ కౌంటర్లతో లేపేస్తున్నారు పోలీసులు.

Uttar Pradesh : ఎన్‌కౌంటర్ చేయనని రాసిస్తేనే ఆస్పత్రికి వస్తా, లేకుంటే రాను.. పోలీసుల ముందు ఖైదీ హల్ చల్

uttar pradesh Hardoi prisoner fearing encounter takes oath from police in hospital

Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ లో నేరస్థులకు ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ పేరు వింటేనే హడలిపోతున్నారు. సీఎం అయినా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పై యోగి ఫుల్ ఫోకస్ పెట్టారు. దీంతో యోగి సర్కారు తీరుతో నేరస్థులు హడలిపోతున్నారు ఎక్కడ ఎన్‌కౌంటర్ చేసిపడేస్తారోనని.ఆఖరికి జైల్లో ఖైదీలు కూడా భయపడిపోతున్నారు. జైల్లో ఉండే ఖైదీలకు అనారోగ్యంపాలైనా జైలు సిబ్బంది వారిని బయట హాస్పిటల్ కు తీసుకెళతామన్నా ఖైదీలు హడలిపోతున్నారు.. హాస్పిటల్ కు అని తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేసేస్తారనే భయంతో. దీంతో రోగం వచ్చినా.. హాస్పిటల్ కు మాత్రం రానంటున్నారు జైల్లో ఖైదీలు.

యూపీలో 2017 మార్చి నుంచి 2018 జులై వరకు యూపీ పోలీసులు గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 3వేల ఎన్‌కౌంటర్ నిర్వహించారు. దాదాపు 78 నేరస్థులను ఎన్‌కౌంటర్‌లో కాల్చి పడేసారు. ఇటువంటి పరిస్థితుల్లో కిడ్నీ సమస్యతో బాధపడే ఓ ఖైదీ డయాలసిస్ కోసం హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉండగా హాస్పిటల్ కాను అంటూ మొండికేశాడు. అంతేకాదు నన్ను హాస్పిటల్ కు అని చెప్పి తీసుకెళ్లి ఎన్‌కౌంటర్ చేస్తారని అందుకే నేను రాను అంటూ మొండికేశాడు. కాదు హాస్పిటల్ కే తీసుకెళతామని పోలీసులు చెప్పినా వినలేదు సదరు ఖైదీ..పైగా మీరు నన్ను హాస్పిటల్ కే తీసుకెళుతున్నాను..ఎన్‌కౌంటర్ చేయటానికి కాదు అని మీరు రాత పూర్వకంగా రాసిస్తేనే వస్తాను..లేదా రాను అంటూ పట్టుపట్టి కూర్చున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

తడిసిపోతున్నాయి : యోగి హయాంలో రికార్డ్ ఎన్ కౌంటర్లు

హర్దోయి జిల్లా జైలులో ఓ ఖైదీ కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. ఆ ఖైదీకి డయాలసిస్ అవసరమని జైలు డాక్టర్లు తెలిపారు. దీంతో ఖైదీని పోలీసు సిబ్బంది భత్రతతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేందకు జైలు సిబ్బంది యత్నించారు. కానీ సదరు ఖైదీ నేను రాను మీరు నన్ను ఎన్‌కౌంటర్ చేయటానికి తీసుకెళుతున్నారు అంటూ నానా హంగామా చేశాడు. కాదు హాస్పిటల్ కే అని చెప్పి బలవంతంగా తీసుకెళ్లారు.దారి పొడుగునా ఆ ఖైదీ నానా యాగీ చేశాడు. తీరా ఆసుపత్రికి చేరుకున్న తర్వాత డయాలసిస్ చేయించుకోవడానికి ఖైదీ ససేమిరా అన్నాడు. పోలీసులు తనను ఎన్‌కౌంటర్ చేస్తారు అంటూ భయపడిపోయాడు. ఎన్‌కౌంటర్ చేయనని రాతపూర్వక హామీ ఇస్తేనే చికిత్స చేయించుకుంటానని పట్టుబట్టాడు. డాక్టర్లు, పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. చివరకు ఉన్నతాధికారులు కల్పించుకుని హామీ ఇచ్చారు. దీంతో సదరు ఖైదీ ఎట్టకేలకు డయాలసిస్ చేయించుకున్నాడు. చికిత్స పూర్తయ్యాక ఆ ఖైదీని పోలీసులు తిరిగి జిల్లా జైలుకు తరలించారు.

యూపీలో మరో ఎన్ కౌంటర్ : పోలీసు కాల్పుల్లో గ్యాంగ్ స్టర్ మృతి

అధికారిక లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో యోగి ఆదిత్యనాథ్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి జులై 2018 వరకు అంటే యోగి 16నెలల పరిపాలనా కాలంలో మొత్తం 3వేల 26 ఎన్ కౌంటర్లు జరిగాయి. 69 మంది నేరస్థులు ఎన్ కౌంటర్ లో చనిపోయారు. 7వేల 43మంది నేరస్థులు అరెస్ట్ అయ్యారు. 838 మంది నేరస్థులుకు గాయాలయ్యాయి. అదే సమయంలో 11వేల 981 మంది నేరస్థుల బెయిల్ రద్దు అయి కోర్టుల్లో సరెండర్ అయ్యారు.