Free Oxygen : ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..సాయం చేసే చేతులకు సంకెళ్లా? అంటూ విమర్శలు

Free Oxygen : ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు..సాయం చేసే చేతులకు సంకెళ్లా? అంటూ విమర్శలు

Vicky Vihari Corona Patients Free Oxygen (1)

Yong man Free Oxygen : కరోనా విలయతాండం చేస్తున్న సమయంలో కరోనా బాధితులకు నా వంతు సహాయంగా ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న ఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఉత్తరప్రదేశ్ జరిగింది. సహాయం చేస్తున్నవారిని అభినందించాల్సింది పోయినవారిపైనే కేసులు పెట్టటం అన్యాయం అని ప్రజలు తిట్టిపోస్తున్నారు. యూపీ పోలీసులు వ్యవహారం చాలా గొప్పగా ఉందంటే ఎద్దేవా చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్​ లోని జౌన్‌పూర్‌ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులకు ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్నఓ యువకుడిపై పోలీసులు కేసు నమోదు చేయటం చర్చనీయాంశంగా మారింది.

జౌన్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు, ఆక్సిజన్​ కొరత ఉందని ఎన్నో వార్తలు వస్తున్నాయి. ఆక్సిజన్ అందక ప్రాణాలు పోతున్న పరిస్థితులున్నాయి. ఈక్రమంలో ఎంతోమంది సహాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. అలా తన వంతుగా సహాయం చేస్తానంటూ విక్కీ అగ్రహారి అనే ఓ యువకుడు ముందుకొచ్చాడు. తన సొంత డబ్బులతో ఆక్సిజన్​ సిలిండర్లను కొని కరోనా రోగులకు ఉచితంగా అందిస్తున్నాడు. మానవత్వంతో సహాయం చేస్తున్నా అతడిని అభినందించాల్సింది పోయి పోలీసులు విక్కీపై కేసు నమోదు చేశారు. కోవిడ్-19 ప్రోటోకాల్‌ను ఉల్లంఘించి రోగులకు ఆక్సిజన్ అందిస్తున్నాడని ఆసుపత్రి మెడికల్​ సూపరింటెండెంట్​ విక్కీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విక్కీపై పోలీసులు కేసు నమోదుచేశారు.

విక్కీ కోవిడ్​–19 పరీక్ష చేయించుకోకుండా..శానిటైజ్​ చేయకుండా రోగులకు ఆక్సిజన్​ అందిస్తున్నాడని సూపరింటెండెంట్ ఆరోపిస్తున్నారు. కోవిడ్ –19 మార్గదర్శకాలను ఏమాత్రం పాటించలేదనీ..దీని వల్ల కరోనా మరింతగా వ్యాపిస్తుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సూపరింటెండెంట్ పేర్కొన్నారు. సూపరింటెండెంట్​ ఫిర్యాదు మేరకు పోలీసులు విక్కీ అగ్రహారిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

కానీ తాను అన్ని జాగ్రత్తలు తీసుకునే ఆక్సిజన్ అవసరమైనవాళ్లకు అందిస్తున్నాననీ..ఏప్రిల్ 29న జౌన్‌పూర్ జిల్లా ఆసుపత్రి బైట ఉన్నరోగులకు ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశాననీ..25 నుంచి 30 మంది రోగులకు ఆక్సిజన్ సిలిండర్లను అందించానని తెలిపాడు.
మానవత్వంతో తాను చేస్తున్న సేవలను గుర్తించాల్సింది పోయి.. ఇలా కేసు పెట్టడం దారుణమని వాపోయాడు విక్కీ విహారి.

ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్​ కావటంతో నెటిజన్టు విక్కీకి సపోర్ట్​ చేస్తూ.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం, పోలీసులల్ని విమర్శిస్తున్నారు. రోగులకు ఆక్సిజన్ అందించలేని ప్రభుత్వం సహాయం చేసే చేసే చేతులకే సంకెళ్లు వేస్తారా? అంటూ ట్రోల్ చేస్తున్నారు.