హిందూ కుర్రాళ్లను పెళ్లాడిన ముస్లిం యువతులకు పోలీసుల సాయం

హిందూ కుర్రాళ్లను పెళ్లాడిన ముస్లిం యువతులకు పోలీసుల సాయం

Muslim women: రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ముస్లిం యువతులను కాపాడారు పోలీసులు. మతమార్పిడి ద్వారా పెళ్లి చేసుకున్న వారిద్దరూ పోలీసుల సహకారంతో సమస్య పరిష్కరించుకున్నారు. బరేలీలోని హఫీజ్‌గంజ్ ఏరియాలో ఇరు కుటుంబాల వ్యక్తులను పోలీసులు స్టేషన్ కు పిలిపించి మాట్లాడారు. ఎటువంటి ఎఫ్ఐఆర్ నమోదు కాకుండానే కాంప్రమైజ్ అయ్యారు. అయితే హిందూ యువకుడ్ని పెళ్లి చేసుకున్న యువతి.. భర్త కుటుంబంపై దొంగతనం చేసినట్లుగా కంప్లైంట్ చేసింది.

సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్(ఎస్ఎస్పీ) రోహిత్ సింగ్ సాజ్వాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ‘హఫీజ్‌గంజ్ బహెడీ ఏరియాలో ఉంటున్న వ్యక్తులు పెళ్లి చేసుకున్నారు. హఫీజ్ గంజ్ కేసులో ఇరు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కు పిలిపించాం. ఎట్టకేలకు యువతి కుటుంబ సభ్యులు పెళ్లిని అంగీకరించడంతో ఎటువంటి కేస్ ఫైల్ అవలేదు’ అని చెప్పారు.

వారిద్దరి పెళ్లి గురువారం రిథోరా ప్రాంతంలోని గుడిలో జరిగింది. ఇరు కుటుంబాల నుంచి ఆ జంటకు రక్షణ కల్పించేందుకు గుడికి సంబంధించిన వ్యక్తులు సైతం ముందుకొచ్చారు.

బహేడీ ఏరియాలో 29ఏళ్ల ముస్లిం యువతి.. మంగళవారం హిందూ కుర్రాడిని పెళ్లాడింది. ఆ తర్వాత ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను హిందూయిజంలోకి మారిపోయిన తర్వాతే పెళ్లిచేసుకున్నానని దానికి ఆమెకు తన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. ‘నా భర్తకు ఏమైనా జరిగితే దానికి కారణం నా పేరెంట్సే’ అని కూడా అందులో చెప్పింది.

ఒకరోజు తర్వాత అంటే బుధవారం ఆ కుటుంబం తన కూతురి భర్తపై కంప్లైంట్ చేశారు. దొంగతనం, కిడ్నాప్ ఆరోపణలు చేశారు. కొత్తగా ఆమోదం పొందిన మతమార్పిడి చట్టాన్ని కూడా అందులో ప్రస్తావించారు యువతి కుటుంబ సభ్యులు. త్వరలోనే కేసును మెజిస్ట్రేట్ వద్ద ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

మేం హైకోర్టు డైరక్షన్ ను ఫాలో అవుతున్నాం. ఇద్దరు వ్యక్తులు వారికి నచ్చినట్లు అయితే రిలేషన్ షిప్ లో ఉండొచ్చని, వారికి ఆ హక్కు ఉందని ఎస్ఎస్పీ సజ్వాన్ చెబుతున్నారు.