Petrol – Diesel: పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.12వరకూ తగ్గించిన యూపీ ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై ఎక్సైజ్ డ్యూటీ కుదించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించింది.

Petrol – Diesel: పెట్రోల్, డీజిల్ రేట్లు రూ.12వరకూ తగ్గించిన యూపీ ప్రభుత్వం

yogi-adityanath-govt

Petrol – Diesel: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ లపై ఎక్సైజ్ డ్యూటీ కుదించడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా వ్యాట్ తగ్గించింది. ఫలితంగా లీటరుపై 12రూపాయల వరకూ ధర తగ్గింది. ‘రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ను పెట్రోల్, డీజిల్ పై రూ.7, రూ.2 తగ్గించింది. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో లీటరుపై రూ.12వరకూ తగ్గింది’ అని అడిషనల్ చీఫ్ సెక్రటరీ నవనీత్ సెహగల్ అన్నారు.

దీపావళికి ముందు రోజు చేసిన ఈ ప్రకటనతో ఇందన ధరల్లో భారీ మార్పులు కనిపించాయి.

దీనిపై యూపీ సీఎం మాట్లాడుతూ.. రేపటి నుంచి పెట్రోల్, డీజిల్ పై రూ.5, రూ.10లు తగ్గనున్నాయని అధికారిక ప్రకటన చేశారు. దాంతో పాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ట్వీట్ ద్వారా పీఎం మోదీని పొగుడుతూ ఒక ట్వీట్ చేశారు.

………………………………………… : ‘ఆదిపురుష్’లో ప్రభాస్ షూటింగ్ పూర్తి

గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించారు. ప్రజాసక్తి మేరకు దీపావళి సందర్భంగా అదనపు సంతోషాన్ని అందజేశారు. ప్రతి సొసైటీలోనూ ఈ నిర్ణయం ప్రశాంతతను నెలకొల్పుతుంది. రాష్ట్ర ప్రజల తరపున మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు’ అని కొనియాడారు.