Uttar Pradesh : యూపీలో శ్రీరాముడి గుడిని అమ్మేసిన పాకిస్థాన్ వ్యక్తి..! దేవాలయాన్ని కూల్చేసి…హోటల్ నిర్మాణం
ఓవైపు మసీదులు–మందిరాల మధ్య వివాదాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని శ్రీరాముడికి గుడిని తెగనమ్మేశాడు అనే ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో బెకన్‌గంజ్‌లో ఉన్న రామ్‌జాంకీ (శ్రీ సీతారాముల దేవాలయం)అమ్మేశాడు..ఆ దేవాలయాన్ని కొన్న వ్యక్తి దాన్ని కూల్చి వేసి..

ram janki temple sold off by pakistani national in UP : ఓవైపు మసీదులు–మందిరాల మధ్య వివాదాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్థాన్ కు చెందిన ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్ లోని శ్రీరాముడికి గుడిని తెగనమ్మేశాడు అనే ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పాకిస్థాన్‌కు చెందిన వ్యక్తి ఉత్తరప్రదేశ్ లో బెకన్‌గంజ్‌లో ఉన్న రామ్‌జాంకీ (శ్రీ సీతారాముల దేవాలయం)అమ్మేశాడు..ఆ దేవాలయాన్ని కొన్న వ్యక్తి దాన్ని కూల్చి వేసి హోటల్‌ని నిర్మించాడు. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చి మరో వివాదానికి తెర తీసింది. కాగా గుడిని కూల్చి వేసి హోటల్ నిర్మించినా ఈనాటికి కూడా అది రికార్డుల్లో గుడిగా నమోదైఉండటంతో అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. దీంతో గుడిని కొన్ని హోటల్ నిర్మించిన వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. కానీ సదరు వ్యక్తి నుంచి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. తమ దగ్గర సంబంధిత డాక్యుమెంట్లు ఉన్నాయని సంబంధిత వ్యక్తి అంటున్నారు.
Also read : QUTUB MINAR : కుతుబ్ మినార్ చుట్టూ ఏం జరుగుతోంది..?ఢిల్లీలోని చారిత్రక కట్టడంపై ఈ వివాదాలేంటీ..?
పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి యూపీలోని కాన్పూర్‌లోని రాముడి ఆలయాన్ని విక్రయించాడు. అబిద్ రెహ్మాన్ అనే వ్యక్తి 1962లో పాకిస్థాన్ కు వలస వెళ్లిపోయాడు.అప్పటి నంచి అతని కుటుంబం అక్కడే నివసిస్తోంది. ఈక్రమంలో అబిద్ రెహ్మాన్ 1982లో బెకాన్‌గంజ్‌లో ఉన్న రామ్ జానకీ ఆలయాన్ని..దానితో పాటు మరికొన్ని ఆస్తులను అబిద్ రెహ్మాన్ ఓ సైకిల్ రిపేర్ షాపు ఉన్న ముఖ్తార్ బాబాకు విక్రయించాడు.
అతను ఆలయాన్ని కూల్చివేసి అక్కడ హోటల్‌ను నిర్మించాడు. అయితే వాటిని శత్రు ఆస్తుల నిర్వహణ అధికారులు శత్రువు ఆస్తులుగా ప్రకటించారు. ఆ స్థలంలో హోటల్‌ని నిర్మించిన వారికి నోటీసులు జారీ చేశారు. అయితే సంబంధిత వ్యక్తుల నుంచి ఎటువంటి స్పందన రాలేదని అధికారులు చెప్పారు.
Also read : UP mathura mosque : మొన్నరాముడు..నిన్నశివుడు..ఇప్పుడు కృష్ణుడు..మసీదులు-మందిరాల చుట్టూ వివాదాలు
ఈ విషయంపై అధికారులు మాట్లాడుతూ..‘సంబంధిత వ్యక్తులకు రెండు వారాల సమయం ఇచ్చామని..ఆస్తులపై ఐదు నిర్ధిష్ట ప్రశ్నలకు సమాధానం ఇస్తారని ఎదురు చూస్తున్నామని..కానీ సదరు వ్యక్తుల నుంచి ఇంకా ఎటువంటి ప్రతిస్పందన రాలేదు అని శత్రువు ఆస్తి సంరక్షకుల కార్యాలయం, చీఫ్ సూపర్‌వైజర్, కన్సల్టెంట్ కల్నల్ సంజయ్ సాహా అన్నారు. అయితే ఆ ఆస్తులను కొనుగోలు చేసిన ముఖ్తార్ బాబా కుమారుడు మొహమూద్ ఉమర్ తన దగ్గర అవసరమైన అన్ని పేపర్లు ఉన్నాయని, నోటీసుపై త్వరలోనే స్పందిస్తానని చెప్పారు.
Also read : UP mathura mosque : మొన్నరాముడు..నిన్నశివుడు..ఇప్పుడు కృష్ణుడు..మసీదులు-మందిరాల చుట్టూ వివాదాలు
నిజానికి పాకిస్థాన్ కుటుంబానికి చెందిన అబిద్ రెహ్మాన్ 1962లో ఆ దేశానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి అతని కుటుంబం అక్కడే జీవిస్తుంది. ఆ తరువాత అబిద్ 1982లో వచ్చి బెకాన్‌గంజ్‌లోని తన ఆస్తిని ముఖ్తార్ బాబాకు అమ్మేశాడు. దానిని కొనుగోలు చేసిన ముఖ్తార్ అక్కడ ఉంటున్న18 హిందూ కుటుంబాలను అక్కడ నుంచి తరలించి.. ఓ హోటల్‌ని నిర్మించాడు. కానీ అది రికార్డుల్లో ఆలయంగానే నమోదై ఉండడంతో శత్రు సంపతి సంరక్షణ సంఘర్ష్ సమితి ఫిర్యాదు చేసింది. దీంతో అధికారులు రంగంలోకి దిగారు. దర్యాప్తు ప్రారంభించారు. సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. వారి నుంచి స్పందన వచ్చాక తదుపరి చర్యలు చేపట్టనున్నారు.
ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ 1968 అనేది భారత పార్లమెంట్ చట్టం. ఇది పాకిస్థానీ పౌరులకు చెందిన భారతదేశంలోని ఆస్తిని స్వాధీనపరచుకునేలా చేస్తుంది. వారి ఆస్తులను నియంత్రిస్తుంది. 1965 ఇండో పాకిస్థాన్ యుద్ధం తర్వాత ఈ చట్టాన్ని ఆమోదించారు. ఈ చట్టానికి 2016లో కొన్ని సవరణలు కూడా చేసిన క్రమంలో చట్టంలో ఎటువంటి లొసులకు తావు లేకుండా సవరణలు చేశారు. అలాగే కస్టోడియన్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల విలువైన శత్రు ఆస్తులు తిరిగి శత్రు సంస్థకు చేరకుండా ఉండేలా మరింత పటిష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలను పరిరక్షించే విధంగా చట్టంలో మార్పులు చేశారు.
- Yogi Govt: యోగి గవర్నమెంట్ షాకింగ్ డెసిషన్.. 21మంది ఐఏఎస్ ఆఫీసర్లు ట్రాన్సఫర్
- Uttar Pradesh : ఆడ పిల్లలకు జన్మనిచ్చిందని..మహిళపై అత్తింటివారు దాడి, చిత్రహింసలు
- UP mathura mosque : మొన్నరాముడు..నిన్నశివుడు..ఇప్పుడు కృష్ణుడు..మసీదులు-మందిరాల చుట్టూ వివాదాలు
- Rajya sabha : యూపీ కోటాలో రాజ్యసభకు వెళ్లనున్న బీజేపీ నేత..మురళీధర్ రావు పేరును పరిశీలిస్తున్న బీజేపీ హైకమాండ్
- GYANVAPI ROW : జ్ఞానవాపి మసీదులోకి శివలింగం ఎలా వచ్చింది ? వీడియోగ్రఫీ సర్వేలో ఏం తేలింది ?
1Sandwich Shot Dead : బాబోయ్.. శాండ్ విచ్లో క్రీమ్ ఎక్కువగా ఉందని కాల్చి చంపేశాడు
2Pooja Hegde: పూజా కొంటె అందాలు చూడతరమా..?
3Indian Railways: రైల్లో కప్పు కాఫీకి రూ.70 చెల్లించిన ప్రయాణికుడు
4The Warrior: వారియర్ కోసం మాస్ డైరెక్టర్, క్లాస్ హీరో!
5BSNL Prepaid Plans : జూలై 1 నుంచి BSNL కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..
6Amarnath Yatra Begins : హరోం హర.. మూడేళ్ల తర్వాత మళ్లీ అమర్నాథ్ యాత్ర ప్రారంభం.. 80వేల మంది సైనికులతో భారీ భద్రత
7Maharashtra: డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఫడ్నవీస్‌పై మోదీ ప్రశంసల జల్లు
8COVID: మా జీరో-కొవిడ్ విధానమే సరైనది: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్
9APSRTC Charges : ఏపీలో మళ్లీ పెరగనున్న ఆర్టీసీ ఛార్జీలు.. ఎప్పటినుంచంటే?
10Sarkaru Vaari Paata: సర్కారు వారి పాట మరో ఫీట్.. ఏకంగా 50!
-
Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!
-
Moto G62 : మోటరోలా నుంచి కొత్త ఫ్లాగ్షిప్ 5G ఫోన్.. ఇండియాలో లాంచ్ ఎప్పుడంటే?
-
NTR: ఎన్టీఆర్ స్టార్ట్ చేశాడు.. ఇక దూకుడు షురూ!
-
iOS16 Beta Update : iOS 16 beta అప్డేట్తో సమస్యలా.. iOS 15కు మారిపోండిలా..!
-
Ramarao On Duty: రామారావు కోసం మసాలా ‘సీసా’.. మామూలుగా లేదుగా!
-
Dasara: ‘దసరా’ ఉందంటూ బ్రహ్మీ మీమ్‌తో డైరెక్టర్ గట్టిగానే ఇచ్చాడుగా!
-
Flagship Smartphones : 2022లో రానున్న కొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు ఇవే..!
-
Saggu biyyam : బరువు తగ్గాలా! సగ్గు బియ్యంతో..