Dengue : ఒక్క గ్రామంలోనే 60మందికి డెంగ్యూ

దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హరిద్వార్ జిల్లాలోని రూర్కీ ప్రాంతంలోని గాధరోనా గ్రామం నుంచి గడిచిన నాలుగు రోజుల్లో సేకరించిన 160

Dengue : ఒక్క గ్రామంలోనే 60మందికి డెంగ్యూ

Dengue

Dengue దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్దఎత్తున డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా హరిద్వార్ జిల్లాలోని రూర్కీ ప్రాంతంలోని గాధరోనా గ్రామం నుంచి గడిచిన నాలుగు రోజుల్లో సేకరించిన 160 శాంపిల్స్ కు టెస్ట్ లు చేయగా…80మందికి డెంగ్యూ పాజిటివ్ గా తేలినట్లు గురువారం అధికారులు తెలిపారు. ఇంతకు ముందు, ఈ గ్రామానికి వచ్చిన 19 మంది డెంగ్యూతో బాధపడుతున్నారని హరిద్వార్ జిల్లా మలేరియా అధికారి డాక్టర్ గుర్నామ్ సింగ్ చెప్పారు. గాధరోనా గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు సివిల్ హాస్పిటల్‌లో చేరారని, కొంతమంది వ్యక్తులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని గుర్నామ్ సింగ్ తెలిపారు.

కాగా,రెండు రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో నాగార్పని పోలీస్ స్టేషన్ పరిధి ఇద్దరు వ్యక్తులు డెంగ్యూతో మరణించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. జ్వరం ఉన్న రోగులు 333 మందికి గడిచిన ఆరు రోజుల్లో పరీక్షలు నిర్వహించబడగా.. మొత్తం 47 మందికి డెంగ్యూ పాజిటివ్‌గా గుర్తించామని మంగళవారం యూపీ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

మరోవైపు,మూడు రోజుల క్రితం ఢిల్లీలో ఈ ఏడాది తొలి డెంగ్యూ మరణం నమోదైన విషయం తెలిసిందే. సోమవారం దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్(SDMC) అధికారులు విడుదల చేసిన డేటా ప్రకారం..ఈ ఏడాదిలో ఇప్పటివరకు మొత్తం 723 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. అందులో ఒక్క అక్టోబర్ నెలలోనే ఇప్పటివరకు న‌మోదైన కేసులు 382 ఉన్నాయి.

ALSO READ #AntiIndia Superman : కశ్మీర్‌పై వివాదాస్పద కామిక్స్ మూవీ.. భారత్ వ్యతిరేకిగా సూపర్‌మ్యాన్!