BJP Chief Mahendra Bhatt comments : ‘జాతీయ జెండా లేని ఇళ్లను ఫొటో తీయండి’..బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ ఈ నెల 10న హల్ద్వానీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు. ‘హర్ ఘర్ తిరంగ’ డ్రైవ్‌లో భాగంగా జాతీయ జెండాను ఇళ్లపై పెట్టుకోని వారిని నమ్మవద్దన్నారు. అలాంటి ఇళ్లను ఫొటో తీసి తనకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు.

BJP Chief Mahendra Bhatt comments : ‘జాతీయ జెండా లేని ఇళ్లను ఫొటో తీయండి’..బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు

BJP chief Mahendra Bhatt comments : బీజేపీ నేతలు వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మరో బీజేపీ నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ మహేంద్ర భట్ ఈ నెల 10న హల్ద్వానీలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ జెండాలు పెట్టుకోని ఇళ్లను ఫొటో తీయాలంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై సర్వత్రా విమర్శలు రావడంతో ఆయన మాట మార్చారు.

‘హర్ ఘర్ తిరంగ’ డ్రైవ్‌లో భాగంగా జాతీయ జెండాను ఇళ్లపై పెట్టుకోని వారిని నమ్మవద్దన్నారు. అలాంటి ఇళ్లను ఫొటో తీసి తనకు ఇవ్వాలని పార్టీ కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. జాతీయ జెండాను ఇంటిపై ఉంచితేనే దేశభక్తి ఉన్నట్లుగా, లేకపోతే దేశంపై నమ్మకం లేనివారిగా ఆయన మాట్లాడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.

Bihar BJP : భారత్ లో ముస్లింల ఓటు హక్కు తొలగించాలి..వారు పాకిస్థాన్ వెళ్లిపోవాలి : బీజేపీ ఎమ్మెల్యే డిమాండ్

తన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు రావడంతో మహేంద్ర భట్ మాట మార్చారు. గురువారం డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ జెండా ర్యాలీలో పాల్గొన్న ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఎవరినీ అనుమానించడం తన ఉద్దేశం కాదన్నారు. ఫొటోలు తీయమన్నది బీజేపీ కార్యకర్తల ఇళ్లనే అంటూ మాట మార్చారు. జాతీయ జెండాను ఇంటిపై ఉంచడంలో ఎవరికైనా ఏమైనా సమస్యా? అభ్యంతరం ఎందుకు? అంటూ ఎదురు ప్రశ్నించారు.