Uttarakhand : కొత్త సీఎం ఎంపిక, ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం

తీరత్‌సింగ్ రాజీనామాతో ఉత్తరాఖండ్‌ బీజేపీ శాసన సభా పక్ష సమావేశం 2021, జూలై 03వ తేదీ శనివారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. సాయంత్రానికి కల్లా కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉంది.

Uttarakhand : కొత్త సీఎం ఎంపిక, ఉత్తరాఖండ్ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం

Tirath Singh

Uttarakhand BJP : తీరత్‌సింగ్ రాజీనామాతో ఉత్తరాఖండ్‌ బీజేపీ శాసన సభా పక్ష సమావేశం 2021, జూలై 03వ తేదీ శనివారం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు జరిగే భేటీలో కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. సాయంత్రానికి కల్లా కొత్త ముఖ్యమంత్రిని ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై సస్పెన్స్‌ నెలకొంది. సత్పాల్ సింగ్, ధన్‌సింగ్ రావత్ పేర్లను అధిష్టానం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరు సీఎం అయ్యే ఛాన్స్‌ ఉందటున్నారు బీజేపీ నేతలు.

ఉత్తరాఖండ్‌లో తీరత్‌సింగ్‌ రాజీనామాతో ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు ముఖ్యమంత్రులు మారారు. మార్చిలో ఉత్తరాఖండ్‌ బీజేపీలో అంతర్గత కుమ్ములాటల కారణంగా త్రివేంద్ర సింగ్ రావత్‌ను సీఎం పీఠం నుంచి దించేసిన హైకమాండ్.. పౌరీ గర్వాల్ లోక్ సభ స్థానం నుంచి ఎంపీగా కొనసాగుతోన్న తీరత్‌ను ముఖ్యమంత్రిని చేసింది. అయితే, ఆరు నెలల్లో ఆయన శాసనసభకు ఎన్నిక కావాల్సి ఉండగా, ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో ఇప్పుడక్కడ రాజ్యాంగ సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. దాన్ని నివారించేందుకు తీరత్ రాజీనామా చేయల్సి వచ్చింది. 3 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసిన తీరత్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పలు దఫాల చర్చల తర్వాత ఆయన ఆదేశాల మేరకు ఉత్తరాఖండ్ గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించారు.