ఎడ్లబండికి వెయ్యి రూపాయలు జరిమానా

ఇటువంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతూ.. సోమవారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఆందోళన చేశారు.

ఎడ్లబండికి వెయ్యి రూపాయలు జరిమానా

ఇటువంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతూ.. సోమవారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఆందోళన చేశారు.

ట్రాఫిక్ ఫైన్లు పొరబాటున వేస్తున్నారో.. సాంకేతిక లోపాల వల్ల జరుగుతున్నాయో వివరాలు లేట్‌గా బయటపెడుతున్నారు కానీ, పెరిగిన ఫైన్‌లతో ఫలితాలు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎడ్ల బండికి వెయ్యి రూపాయల జరిమానా విధించారు ట్రాఫిక్ పోలీసులు. సెక్టన్ 81 ప్రకారం.. పొలం బయట ఆపిన ఎడ్లబండికి నో పార్కింగ్ జోన్‌లో ఫైన్ వేసినట్లు ఆరోపించారు రైతులు. ఇలాటి ఫైన్లు కూడా ఉంటాయా అని పోలీసులను ప్రశ్నించారు. 
 
ఇటువంటి ఘటనలు పెరిగిపోతుండటంతో ప్రజల్లో వ్యతిరేకత అధికమవుతూ.. సోమవారం ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని రూర్కీ పట్టణంలో ఆందోళన చేశారు. నిరసనల స్థాయి పెరిగి హింసాత్మక ఘటనలకు దారితీశాయి. ఉత్తరాఖండ్‌ పోలీసులపై నిరసన వ్యక్తం చేస్తూ… ఆగ్రహంతో డెహ్రాడూన్‌లోని చార్బా గ్రామ రైతులు రెండు మోటార్‌సైకిళ్లను తగులబెట్టారు. కొత్త వాహన చట్టం అమల్లోకి వచ్చినప్పటి నుంచి పోలీసులు తమపై భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు రైతులు ఆరోపించారు. 

చార్బా గ్రామానికి చెందిన రియాజ్‌ హసన్‌ అనే ఎడ్ల బండి యజమానికి పోలీసులు రూ. వెయ్యి చలానా విధించడంతో రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పై అధికారుల వరకూ సమాచారం వెళ్లడంతో పోలీసులే పొరబడినట్లు తెలుసుకున్నారు. దీంతో చలానా క్యాన్సిల్ చేసినప్పటికీ రైతుల్లో ఆగ్రహం హద్దు మీరింది.