Uttarakhand: జోషిమఠ్‌లో వర్షం.. పెరిగిన ప్రమాద తీవ్రత.. నరసింహ ఆలయంలో సీఎం పూజలు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం ఉదయం జోషిమఠ్ లో పర్యటించారు. నరసింహ ఆలయంలో పూజలు చేశారు. బుధవారం రాత్రి నుంచి సీఎం ధామి జోషిమఠ్ లోనే ఉన్నారు. బుధవారం రాత్రి సహాయ శిబిరాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు.

Uttarakhand: జోషిమఠ్‌లో వర్షం.. పెరిగిన ప్రమాద తీవ్రత.. నరసింహ ఆలయంలో సీఎం పూజలు

uttarakhand cm dhami

Uttarakhand: జోషిమఠ్‌లో ప్రమాద తీవ్ర అంతకంతకూ పెరుగుతోంది. కొండచరియలు విరిగిపడటంతో పాటు, భూమి లోపల కదలికల కారణంగా ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఇప్పటికే 753 ఇళ్లకు పగుళ్లు వచ్చాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర, కేంద్ర బృందాలే ఆ ప్రాంతాన్ని పరిశీలించి పగుళ్లకు కారణాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు పగుళ్ల కారణంగా కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను కూల్చివేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే, అందుకు స్థానిక ప్రజలు ససేమీరా అంటున్నారు.

Uttarakhand: ఉత్తరాఖండ్‌లో 561 ఇళ్లకు పగుళ్లు.. సురక్షిత ప్రాంతాలకు ప్రజల తరలింపు

ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి గురువారం ఉదయం జోషిమఠ్ లో పర్యటించారు. నరసింహ ఆలయంలో పూజలు చేశారు. బుధవారం రాత్రి నుంచి సీఎం ధామి జోషిమఠ్ లోనే ఉన్నారు. బుధవారం రాత్రి సహాయ శిబిరాలకు వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు అండగా నిలుస్తున్నామని, మొత్తం పరిస్థితిని ప్రధాని మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. పగుళ్ల కారణంగా కూలేందుకు సిద్ధంగాఉన్న ఇళ్లను కూల్చేస్తామని, బాధిత ప్రజలకు రూ.1.5లక్షలు మధ్యంతర సాయంగా అందజేస్తామని ధామీ అన్నారు.

Uttarakhand: జోషిమఠ్‌లోనే కాదు.. కర్ణప్రయాగ్‌ నగరంలోనూ ఇళ్లకు పగుళ్లు.. భయంగుప్పిట్లో ప్రజలు

మరోవైపు జోషిమఠ్‌లో ప్రమాద తీవ్రత మరింత పెరిగింది. వాతావరణం ప్రతికూలంగా ఉండటంతో స్థానిక ప్రజలుభయాందోళన చెందుతున్నారు. వర్షంకారణంగా మరిన్ని ఇళ్లకు పగుళ్లు వచ్చే అవకాశం ఏర్పడింది. దీంతోస్థానిక ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. మరోవైపు పగుళ్లు కారణంగా కూలేందుకు సిద్ధంగా ఉన్న ఇళ్లను కూల్చేసే కార్యక్రమాన్నిప్రభుత్వం చేపట్టింది. అయితే హోటల్ మలారి ఇన్ కూల్చివేత పనులు ప్రారంభం కావాల్సి ఉంది. పరిహారంపై ప్రజల నిరసనల కారణంగా కూల్చివేతల ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే, ముఖ్యమంత్రి ధామీ ఈ విషయంపై మాట్లాడుతూ.. హోటల్ భవనాలను మాత్రమే కూల్చివేస్తామని, భద్రతలేని ఇళ్లను కూల్చివేయబోమని స్పష్టం చేశారు.