ఉత్తరాఖండ్ బీజేపీలో అసమ్మతి..హఠాత్తుగా ఢిల్లీకి సీఎం రావత్

ఉత్తరాఖండ్​ బీజేపీలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రావత్​ పనితీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా సీఎంపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరాఖండ్​ బీజేపీలో అసమ్మతి తలెత్తింది. రాష్ట్ర బీజేపీలో వరుస ఘటనల నేపథ్యంలో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

ఉత్తరాఖండ్ బీజేపీలో అసమ్మతి..హఠాత్తుగా ఢిల్లీకి సీఎం రావత్

Uttarakhand ఉత్తరాఖండ్​ బీజేపీలో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. మంత్రులతో పాటు 20 మంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రావత్​ పనితీరుపై గుర్రుగా ఉన్నారు. అంతేకాకుండా సీఎంపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఉత్తరాఖండ్​ బీజేపీలో అసమ్మతి తలెత్తింది. రాష్ట్ర బీజేపీలో వరుస ఘటనల నేపథ్యంలో నాయకత్వ మార్పు గురించి ఊహాగానాలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.

అయితే,అధికార బీజేపీలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు నియామకమైన ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దుష్యంత్​ కుమార్ గౌతమ్,ఉత్తరాఖండ్​ ఇన్ చార్జ్ గా ఉన్న ఛత్తీస్ ఘడ్ మాజీ సీఎం రమణ్​ సింగ్​ తమ నివేదికను హైకమాండ్ కు సమర్పించారు. నివేదిక సమర్పించిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నుంచి సీఎం త్రివేంద్రసింగ్ రావత్ కి​ ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు వచ్చింది. ఈ మేరకు సోమవారం ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.మార్చి 8 న గైర్సేన్ మరియు డెహ్రాడూన్లలో అనేక కార్యక్రమాలకు రావత్ హాజరుకావలసి వచ్చింది, కాని, ఢిల్లీ నుండి వచ్చిన సమన్లు ​​తరువాత ఆయన వాటిని రద్దు చేసుకొని హస్తినకు బయల్దేరారు.

గత శనివారం డెహ్రాడూన్ లో అత్యవసరంగా నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో దుష్యంత్, రమణ్​ సింగ్​ తో పాటు సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, మాజీ సీఎం విజయ్ బహుగుణ,నైనిటాల్ ఎంపీ అజయ్ భట్, రాజ్యసభ ఎంపీ నరేష్ భన్సల్,తెహ్రీ మాలా రాజ్యలక్ష్మి,రాష్ట్ర బీజేపీ జనరల్ సెక్రటరీ అజేయ కుమార్,రాష్ట్ర మంత్రులు మదన్ కౌశిక్,ధన్ సింగ్ రావత్ తదితరులు పాల్గొన్నారు. రెండు గంటలకుపైగా సాగిన ఈ కోర్ కమిటీ సమావేశంలో ఉత్తరాఖండ్​లో పరిస్థితులపై చర్చించారు. ఛత్తీస్‌ ఘడ్ మాజీ ముఖ్యమంత్రి,ఉత్తరాఖండ్​ ఇన్ చార్జ్ రమణ్​ సింగ్… కోర్ గ్రూపులోని ప్రతి సభ్యుడితో విడి విడిగా మాట్లాడి వారి ఫీడ్ బ్యాక్ ను తీసుకున్నారు. అంతేకాకుండా సుమారు 40 మంది పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న ముఖ్యమంత్రి అధికారిక నివాసానికి వెళ్లి, తరువాత డెహ్రాడూన్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయాన్ని సందర్శించారు. కోర్ గ్రూపులోని మరో సభ్యుడు, కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ ‘నిశాంక్’ కూడా రమణ్ సింగ్‌ను ఆ రోజు సాయంత్రం జాలీ గ్రాంట్ విమానాశ్రయంలో కలిశారు. కోర్ కమిటీ సమావేశం తర్వాత పార్టీ జనరల్ సెక్రటరీ దుష్యంత్​ కుమార్ గౌతమ్,ఉత్తరాఖండ్ వ్యవహారాల భాధ్యుడు రమణ్ సింగ్ లు అధిష్ఠానానికి నివేదికను అందజేశారు. నివేదిక సమర్పించిన నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం నుంచి సీఎం త్రివేంద్రసింగ్ రావత్ కి​ ఢిల్లీకి రావాల్సిందిగా పిలుపు వచ్చింది.

ఇదిలావుండగా, శనివారం జరిగిన సమావేశంలో రావత్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నాలుగేళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా మార్చి 18 న రాష్ట్రంలోని 70 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరుపుకునే వేడుకల గురించి కోర్ గ్రూప్ సమావేశం చర్చించినట్లు ఉత్తరాఖండ్ బీజేపీ చీఫ్ భన్సిధర్ భగత్ తెలిపారు. రాష్ట్రంలో నాయకత్వ మార్పులేవీ లేవని ఆయన పేర్కొన్నారు.