ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా “తీరథ్ సింగ్ రావత్” ఎంపిక

ఉత్తరాఖండ్ కొత్త సీఎంగా “తీరథ్ సింగ్ రావత్” ఎంపిక

ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా తీరత్ సింగ్ రావత్‌ ఎంపికయ్యారు. సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతి ఎదుర్కోవడంతో మంగళవారం సీఎం పదవికి త్రివేంద్ర సింగ్ రావత్ రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో ఇవాళ డెహ్రాడూన్‌లోని బీజేపీ కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించి కొత్త సీఎంగా తీరత్ సింగ్‌ను ఎన్నుకున్నారు.

సీఎం పదవి కోసం పలువురు ఆశావాహుల పేర్లను పరిశీలించి,చివరకు తీరథ్ వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో సీఎంగా తీరథ్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఉత్తరాఖండ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ఏడాది ముందు సీఎంను మార్చడం చర్చనీయాంశంగా మారింది

56 ఏళ్ల తీరథ్ సింగ్ రావత్.. ప్రస్తుతం గర్హ్వాల్ ఎంపీగా ఉన్నారు. గతంలో 2013 నుంచి 2015 వరకు ఉత్తరాఖండ్ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఎమ్మెల్యేగానూ సేవలందించారు. ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న తీరథ్ సింగ్ రావత్‌‌కు ఉత్తరాఖండ్‌ బలమైన బీసీ సామాజికవర్గ నేతగా పేరుంది. బీజేపీ పెద్దలతో పాటు రాష్ట్ర నేతలు కూడా ఆయకే జై కొట్టడంతో.. ఉత్తరాఖండ్ 10వ సీఎంగా ఆయన ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.