ఉత్తరాఖండ్ కు మరో రాజధాని..సీఎం కీలక ప్రకటన

  • Published By: venkaiahnaidu ,Published On : March 4, 2020 / 03:36 PM IST
ఉత్తరాఖండ్ కు మరో రాజధాని..సీఎం కీలక ప్రకటన

ఉత్తరాఖండ్‌ సీఎం పెద్ద ప్రకటన చేశారు. వేసవి రాజధానిగా చమోలి జిల్లాలోని గైర్సైన్‌ను ఎంపిక చేసినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తివేంద్ర సింగ్‌ రావత్‌ ప్రకటించారు. ఈ  మేరకు ముఖ్యమంత్రి ఈ విషయాన్ని అసెంబ్లీలో తెలిపారు. గైర్సైను శాశ్వత రాజధానిగా చేయాలని కొంత కాలంగా పర్వత ప్రాంత ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. కర్న్ ప్రయాగ్ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ నేగి ఇటీవల సీఎంతో సమావేశమైనత తర్వాత ఈ పెద్ద ప్రకటన వచ్చినట్లు తెలుస్తోంది. వేసవి రాజధానిగా గైర్సైన్‌ ఎంపిక చేయాలని సురేంద్ర డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ ఎన్నికల తీర్మాణంలో కూడా గైర్సైన్‌ ను వేసవి రాజధానిగా చేస్తామని పొందుపర్చారు.  అయితే ఉత్తరాఖండ్‌ పరిపాలనా క్యాపిటల్‌గా డెహ్రాడూన్‌, జ్యుడీషియల్‌ రాజధానిగా నైనిటాల్  కొనసాగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం  గైర్సైన్‌లో కొత్త అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. అధికారుల నివాస భవనాలు సహా పలు భవనాలు నిర్మాణ దశలో ఉన్నాయి. గైర్సైన్‌ ప్రాంత సమీపంలో విమానాశ్రయ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.