Uttarakhand : రుతుపవనాల ప్రభావం, ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి

నైరుతి రుతుప‌వ‌నాల ప్రభావంతో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, మ‌హారాష్ట్ర, మ‌ధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎడ‌తెర‌పి లేకుండా వాన‌లు ప‌డుతున్నాయి. ఉత్తార‌ఖండ్‌లో కుంభ‌వృష్టి కురిసింది. శ్రీన‌గ‌ర్‌, పౌరీ గ‌ర్వాల్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీగా వ‌ర‌ద నీరు నిలిచింది. అల‌క్‌నందా న‌ది ఉప్పొంగి ప్రవ‌హిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమ‌య్యారు.

Uttarakhand : రుతుపవనాల ప్రభావం, ఉత్తరాఖండ్ లో కుంభవృష్టి

Uttarakhand Rains

Uttarakhand Flood Alert : నైరుతి రుతుప‌వ‌నాల ప్రభావంతో దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, ఉత్తరాఖండ్, మ‌హారాష్ట్ర, మ‌ధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఎడ‌తెర‌పి లేకుండా వాన‌లు ప‌డుతున్నాయి. ఉత్తార‌ఖండ్‌లో కుంభ‌వృష్టి కురిసింది. శ్రీన‌గ‌ర్‌, పౌరీ గ‌ర్వాల్‌లోని ప‌లు ప్రాంతాల్లో భారీగా వ‌ర‌ద నీరు నిలిచింది. అల‌క్‌నందా న‌ది ఉప్పొంగి ప్రవ‌హిస్తుంది. దీంతో అధికారులు అప్రమత్తమ‌య్యారు. అల‌క్‌నందా, ధౌలిగంగా ప‌రివాహ‌క ప్రాంతాల్లో ప్రజ‌ల‌ను అప్రమ‌త్తం చేశారు. గంగా నదిలో నీటిమట్టం పెరగడంతో రిషికేష్‌ ప్రాంత ప్రజలను కూడా అధికారయంత్రాంగం అప్రమత్తం చేసింది. రానున్న 72 గంటలలో నైనిటాల్, రుద్రప్రయాగ్, చమోలీ, పిథౌర్‌గఢ్, తదితర జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ జిల్లాలలో ఆరేంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది.

ఉత్తరప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇక మోరదాబాద్‌లోని రైల్వేస్టేషన్‌ మొత్తం నీటితో నిండిపోయింది. రైలు పట్టాలపై భారీగా వర్షపు నీరు నిలవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో అధికారులు మోటారు పంపులతో నీళ్లను బయటికి తోడుతున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరకుండా చర్యలు చేపట్టారు. బీహార్‌లోనూ వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల దాటికి నదులు, చెరువులు, వాగులు, వంకలు నిండు కుండలా మారాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఈదురుగాలులతో కురిసిన వర్షానికి పలు చోట్ల చెట్లు, హోర్డింగ్స్‌ కుప్పకూలాయి.