ఆరు నెలల అనంతరం : భక్తులకు దర్శమిస్తున్న కేదారనాథుడు

  • Published By: veegamteam ,Published On : May 9, 2019 / 04:17 AM IST
ఆరు నెలల అనంతరం : భక్తులకు దర్శమిస్తున్న కేదారనాథుడు

ఉత్తరాఖండ్‌: పరమ పవిత్ర పుణ్యక్షేత్రం కేదార్‌నాథ్‌ ఆలయంలో గురువారం (May 9)ఉదయం నుంచి దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆరు నెలల తర్వాత కేదార్‌నాథ్‌ ఆలయం తెరుచుకుంది. దీంతో కేదార్‌నాథుని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారు జామునుంచే భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం పున: దర్శనంతో ఆరు నెలల పాటు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. అక్టోబర్-నవంబర్ మధ్యకాలంలో మరోసారి దేవాలయాన్ని ఆలయాన్ని మూసివేస్తారు. ఇది గతకాలం నుంచి  ఆనవాయితీగా వస్తోంది. ఇది భక్తుల భ్రదతతో కూడుకున్నది కూడా. శీతాకాలంలో విపరీతమైన మంచు కారణంగా ఆలయాన్ని ఆరునెలల పాటు  మూసివేస్తారునే విషయం తెలిసిందే.
 
శీతాకాలం పూర్తయి వేసవి ఆరంభమైన కొద్దిరోజులకు కేథార్ నాథ్ ఆలయాన్ని పూజారులు తెరుస్తారు. అనంతరం  భక్తులకు స్వామివారి దర్శనభాగ్యాన్ని కల్పిస్తారు. ఇదే క్రమంలో చార్ దామ్ యాత్రలో ఒకటైన  బద్రీనాథ్‌ ఆలయం శుక్రవారం (May 10)నుంచి తెరుచుకోనుంది. కాగా బద్రినాథ్ ఆయాన్ని మూసివేసే ముందు  స్వామివారి సన్నిథిలో అఖండ జ్యోతిని వెలిగిస్తారు పూజారులు. ఈ జ్యోతి తిరిగి ఆలయం పున: దర్శనం వరకూ నిరాటంకంగా వెలుగుతుండటం స్వామివారి మహిమేనని భక్తులు విశ్వాసం. ఈ క్రమంలో స్వామివారి దేవాలయాన్ని తెరిచేందుకు..భక్తులకు దర్శనం కల్పించేందుకు ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.