Uttarakhand: బ‌ద్రీనాథ్ ఆల‌యంపై మ‌ల్లెలు చ‌ల్లిన‌ట్లుగా మంచు వ‌ర్షం!

మన దగ్గర ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు కొద్దిగా వాతావరణం ఉపశమనం కలిగినా సోమవారం నుండి మళ్ళీ ఎండలు మండిపోనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఏపీలో అయితే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దక్షణాదిలో దాదాపు వేడి వాతావరణమే ఉన్న ఈ వేసవిలో ఉత్తరాఖండ్ లో మాత్రం మంచు వర్షం కురుస్తుంది.

Uttarakhand: బ‌ద్రీనాథ్ ఆల‌యంపై మ‌ల్లెలు చ‌ల్లిన‌ట్లుగా మంచు వ‌ర్షం!

Uttarakhand Snow On The Badrinath Temple As The Rain Fell

Uttarakhand: మన దగ్గర ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలకు కొద్దిగా వాతావరణం ఉపశమనం కలిగినా సోమవారం నుండి మళ్ళీ ఎండలు మండిపోనున్నాయని ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఏపీలో అయితే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు వేడి గాలులు మొదలవగా కోస్తాలో అయితే భగభగలు కనిపిస్తున్నాయి. దక్షణాదిలో దాదాపు వేడి వాతావరణమే ఉన్న ఈ వేసవిలో ఉత్తరాఖండ్ లో మాత్రం మంచు వర్షం కురుస్తుంది.

ఉత్త‌రాఖండ్‌లో నాలుగు పుణ్య‌క్షేత్రాల‌కు నెలవు అయిన చార్‌ధామ్‌ ఎంతటి ప్రాముఖ్యత కలిగి ఉందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక్కడ వాతావ‌ర‌ణం దాదాపుగా ఎప్పుడూ చ‌ల్ల‌గానే ఉంటుంది. హిమాల‌యాల కార‌ణంగా రోజూ మంచు కురుస్తుండ‌టంతో చార్‌ధామ్ ప‌రిస‌రాల‌న్నీ ఆహ్లాద‌క‌రంగా ఉంటాయి. ఇప్పుడు కూడా మంచు వర్షం కురుస్తుండగా బ‌ద్రీనాథ్ ఆల‌యంపై మ‌ల్లెలు చ‌ల్లిన‌ట్లుగా మంచు వ‌ర్షం కురుస్తూ క‌నువిందు చేస్తున్న‌ది. ఆ ముగ్ధ మ‌నోహ‌ర‌మైన దృశ్యాల‌ను కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది అందరికీ కనువిందు చేస్తుంది.