Uttarakhand : తెల్ల నెమలి..85 ఏళ్ల చరిత్రలో తొలిసారి

తెల్ల నెమలి కనిపించడం 85 ఏళ్ల చరిత్రలో తొలిసారి అని అంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్ లో ఇది కనిపించింది. కార్బెట్ టైగర్ రిజర్వ్ లోని కోతి రౌ సమీపంలో ఎప్పటిలాగానే..ఫారెస్ట్ సిబ్బంది పెట్రోలింగ్ కు వెళ్లారు.

Uttarakhand : తెల్ల నెమలి..85 ఏళ్ల చరిత్రలో తొలిసారి

Uttarakhand

White peafowl : నెమలి..ఇది పురివిప్పి నాట్యమాడుతుంటే..చూసేందుకు రెండు కళ్లు చాలవు. దాని అందం అలాంటిది. అయితే…తెల్ల నెమలి దర్శనమిచ్చింది. దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తెల్ల నెమలి కనిపించడం 85 ఏళ్ల చరిత్రలో తొలిసారి అని అంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రడూన్ లో ఇది కనిపించింది. కార్బెట్ టైగర్ రిజర్వ్ లోని కోతి రౌ సమీపంలో ఎప్పటిలాగానే..ఫారెస్ట్ సిబ్బంది పెట్రోలింగ్ కు వెళ్లారు.

ఇక్కడ బ్లూ కలర్ నుంచి గ్రీన్ వరకు అన్ని రకాల నెమల్లుంటాయి. అయితే..సిబ్బంది వెళ్లిన సమయంలో తెల్ల నెమలి కనిపించడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. తొలుత నమ్మలేదు. తెల్ల నెమలియేనా అని తెలుసుకొనేందుకు మరుసటి రోజు ఉదయం అక్కడకు వెళ్లారు. మళ్లీ తెల్ల నెమలి తారసపడింది. తెల్ల నెమలి ఉందని నిర్ధారించుకున్నారు. ఈ విషయాన్ని రిజర్వ్ డైరెక్టర్ రాహుల్ వెల్లడించారు. ఇంకా ఇలాంటి నెమల్లు ఉన్నాయనే దానిపై ఆరా తీస్తున్నామని, వాటి కదలికలపై నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఇది చాలా అరుదైన దృశ్యమని, అడవిలో తెల్ల నెమలిని ఎప్పుడూ చూడలేదని డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సైంటిస్టులు వెల్లడించారు.