UP Election 2022 : 172 స్థానాలకు అభ్యర్థుల ఖరారు!..మాదే విజయమన్న కేశవ్ ప్రసాద్ మౌర్య

మొత్తం 172 అభ్యర్థుల విషయంలో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు.

UP Election 2022 : 172 స్థానాలకు అభ్యర్థుల ఖరారు!..మాదే విజయమన్న కేశవ్ ప్రసాద్ మౌర్య

Up Bjp

UP BJP Finalises Candidates : అందరి దృష్టి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంపై నెలకొంది. అక్కడ త్వరలోనే ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలో..అధికారంలో ఉన్న బీజేపీకి సొంత పార్టీ నేతలే షాక్ లిస్తున్నారు. ఇందులో మంత్రులు కూడా ఉండడం విశేషం. ఈ నేపథ్యంలో…అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలు పెట్టింది. 2022, జనవరి 13వ తేదీ గురువారం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అభ్యర్థుల ఖరారుపై చర్చించారు. మొత్తం 172 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు సమాచారం. శాసనమండలి సభ్యులుగా ఉన్న సీఎం యోగి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కేశవ్ ప్రసాద్ లను అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Read More : Guwahati-Bikaner : బెంగాల్‌లో ఘోర రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన 12 బోగీలు.. ముగ్గురు మృతి

మొత్తం 172 అభ్యర్థుల విషయంలో ఫలప్రదమైన చర్చలు జరిగాయని, 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధిస్తామని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ధీమా వ్యక్తం చేశారు. సీఎం యోగి ఆదిత్యనాథ్ ను అయోధ్య నుంచి, సిరతు నియోజకవర్గం నుంచి మౌర్యలను దింపాలని బీజేపీ యోచిస్తోందని టాక్. మిత్రపక్షమైన Nishad Partyకి 15 నుంచి 17 స్థానాల్లో పోటీ చేయనుండగా…అప్నాదళ్ కు 14 సీట్లు ఇవ్వనున్నట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.

Read More : Talasani Srinivas Yadav : తెలంగాణలో థియేటర్లపై ఎలాంటి ఆంక్షలు ఉండవు

రాంపూర్, సుల్తాన్ పూర్, ఆజంగడ్, సంత్ కబీర్ నగర్, గోరఖ్ పూర్, జౌన్ పూర్, ఖుషీనగర్, మహరాజ్ గంజ్ నుంచి Nishad Party పోటీ చేయనుంది. అయోధ్య, ప్రతాప్ గడ్, అలహాబాద్, మీర్జాపూర్ స్థానాల్లో అప్నాదళ్ పోటీ చేస్తుందని భావిస్తున్నారు. రాంపూర్ జిల్లాలో సువార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎస్పీ ఎంపీ ఆజంఖాన్ కుమారుడిపై కూడా పోటీకి దించాలని ఆ పార్టీ భావిస్తోందని తెలుస్తోంది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఏడు దశల్లో పోలింగ్ జరుగనుంది. చివరి దశ పోలింగ్ మార్చి 07వ తేదీన నిర్వహించనున్నారు. ప్రధాన పోటీ బీజేపీ – అఖిలేష్ యాదవ్ మధ్యే కనిపిస్తోంది. మార్చి 10వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి.