Young Vaccine : కేవలం 7 రాష్ట్రాల్లోనే 85శాతం వ్యాక్సినేషన్.. యువతకు టీకా వేయడంలోనూ ఇంత అసమానత

దేశంలో విలయతాండవం చేస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్న కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ఇదే విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అయినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జోరుని పెంచలేకపోతున్నాయి. ఇంకా చాలామందికి టీకాలు ఇవ్వాల్సి ఉంది.

Young Vaccine : కేవలం 7 రాష్ట్రాల్లోనే 85శాతం వ్యాక్సినేషన్.. యువతకు టీకా వేయడంలోనూ ఇంత అసమానత

Young Vaccine

Young Vaccine : దేశంలో విలయతాండవం చేస్తూ ప్రాణాలు బలితీసుకుంటున్న కరోనాను కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సినేషన్. ఇదే విషయాన్ని నిపుణులు పదే పదే చెబుతున్నారు. అయినా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ కార్యక్రమంలో జోరుని పెంచలేకపోతున్నాయి. ఇంకా చాలామందికి టీకాలు ఇవ్వాల్సి ఉంది. మరీ ముఖ్యంగా యువతకి. 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి టీకాలు ఇవ్వడంలో ప్రభుత్వాల వైఫల్యం కనిపిస్తోంది. యువతకు టీకా వేయడంలో భారీ అసమానత కనిపిస్తోంది. కేవలం 7 రాష్ట్రాల్లో మాత్రమే 85శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్టు గణాంకాలు చెబుతున్నాయి. చాలా రాష్ట్రాల్లో 18 నుంచి 44 ఏళ్ల లోపు వారికి స్వల్ప సంఖ్యలో మాత్రమే టీకాలు ఇచ్చారు.

దేశంలో మే 1 నుంచి 18ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇస్తామని కేంద్రం చెప్పింది. అయితే టీకా కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ వాయిదా పడింది. మే 1 నుంచి మే 12 వరకు 34.66 లక్షల టీకా డోసులు వేస్తే.. అందులో 18-44 ఏళ్లలోపు వారికి ఏడు రాష్ట్రాల్లో మాత్రమే 85శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. మహారాష్ట్రలో 6.25లక్షల మందికి, రాజస్తాన్ లో 5.49లక్షల మందికి, ఢిల్లీలో 4.71లక్షల మందికి, గుజరాత్ లో 3.86లక్షల మందికి, హర్యానాలో 3.55లక్షల మందికి, బీహార్ లో 3.02లక్షల మందికి, ఉత్తరప్రదేశ్ లో 2.65లక్షల మంది కరోనా టీకాలు వేశారు. దేశంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 82శాతం కేసలు ఈ ఆరు రాష్ట్రాల నుంచే ఉంటున్నాయి.

ఈ ఏడు రాష్ట్రాల్లో 85శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. కాగా, టీకాల కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో 18ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇవ్వడం లేదు. కర్నాటకలో(5.87 లక్షలు) యాక్టివ్ కేసుల లోడ్ ఎక్కువగా ఉంది. అక్కడ కేవలం 74వేల 105 మందికి మాత్రమే టీకాలు ఇచ్చారు. ఆ తర్వాత కేరళ( యాక్టివ్ కేసుల లోడ్ 4.24 లక్షలు) లో 771మందికి మాత్రమే టీకాలు ఇచ్చారు. ఏపీలో(యాక్టివ్ కేసుల లోడ్ -1.95లక్షలు) 1,133మందికి.. తమిళనాడులో(1.62 లక్షల యాక్టివ్ కేసుల లోడ్) 22వేల 326మందికి టీకాలు ఇచ్చారు. తెలంగాణ, అసోం రాష్ట్రాల్లో దాదాపుగా 3 కోట్ల జనాబా ఉంది. 18-44 ఏజ్ గ్రూప్ విషయానికి వస్తే.. అసోంలో 1.31లక్షల మంది టీకాలు ఇచ్చారు. అదే తెలంగాణలో కేవలం 500మందికి మాత్రమే ఇచ్చినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఉత్తరాఖండ్ లో కోటి జనాభా ఉంటే.. 50వేల 968మందికి టీకాలు ఇచ్చారు. మూడు కోట్ల జనాభా ఉన్న పంజాబ్ లో 5వేల 469మందికి, జార్ఖండ్ లో 94మందికి మాత్రమే టీకాలు ఇచ్చారు.

ముందుగా హెల్త్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు, 45ఏళ్లు పైబడిన వారికి టీకాలు ఇచ్చారు. చాలామంది ఫస్ట్ డోస్ తీసుకుని సెకండ్ డోస్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు 18 నుంచి 44 ఏళ్లు ఉన్న వారికి కూడా టీకాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకున్నా.. ఆచరణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. టీకాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. చాలా రాష్ట్రాల్లో 18 నుంచి 44ఏళ్ల వయసున్న వారికి టీకా కార్యక్రమాన్ని వాయిదా వేశాయి. ముందు తొలి డోసు తీసుకుని సెకండ్ డోసు కోసం వెయిట్ చేస్తున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి.