Vaccine Registrations : 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్..ఏప్రిల్ 24 నుంచి రిజిస్ట్రేషన్…ఎలా చేసుకోవాలి

18 ఏళ్లు నిండిన వారందరికీ మే 01వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని నేషనల్ హెల్త్ అథార్టీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్లడించారు.

Vaccine Registrations : 18 ఏళ్లు నిండిన వారికి వ్యాక్సిన్..ఏప్రిల్ 24 నుంచి రిజిస్ట్రేషన్…ఎలా చేసుకోవాలి

Vaccine Registrations

Above 18 Years : కరోనా వ్యాక్సిన్ పంపిణీని స్పీడప్ చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకొంటోంది. కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండడంతో 18 ఏళ్లు నిండిన వారందరికీ మే 01వ తేదీ నుంచి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఇప్పటికే కేంద్రం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రిజిస్ట్రేషన్ విషయంలో క్లారిటీ రాలేదు. ప్రస్తుతం 45 ఏళ్ల వయసు దాటిన వారికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా..2021, ఏప్రిల్ 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని నేషనల్ హెల్త్ అథార్టీ సీఈవో ఆర్ఎస్ శర్మ గురువారం వెల్లడించారు.



CoWin యాప్ ద్వారా…రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 18 ఏళ్లు నిండిన వారందరూ రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం ఉందని, వ్యాక్సినేషన్ ప్రక్రియ, అవసరమైన డాక్యుమెంట్లు గతంలోలాగానే ఉంటాయని తెలిపారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను స్పీడప్ చేసేందుకు మరిన్ని ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా వ్యాక్సినేషన్ కొనసాగుతుందని..ఈ సంఖ్య పెరిగిందన్నారు.

ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి :-



మీ మొబైల్ ఫోన్ selfregistration.cowin.gov.in ఓపెన్ చేయాలి. రిజిష్టర్ బటన్‌పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నంబర్ టైప్ చేసిన తర్వాత..‘Get OTP’పై క్లిక్ చేయాలి. మీరు ఇచ్చిన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్‌చేసి ‘VERIFY’ మీద క్లిక్ చేయాలి. ఒక్క మొబైల్ నంబర్ ఆధారంగా..నలుగురు కుటుంబసభ్యులకు వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ చేసుకొనే అవకాశం ఇచ్చారు. ఇలా చేసిన అనంతరం మరో పేజ్ ఓపెన్ అవుతుంది. గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. (ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, పాస్‌పోర్టు. పెన్షన్ పాస్ బుక్, NPR స్మార్ట్ కార్డు, ఓటర్ ఐడీ). ఏదో ఒకటి ఎంచుకుని వాటి నెంబర్ ను టైప్ చేయాలి.

ఇక ఎంపిక చేసుకున్న ఐడెంటిటీ కార్డు మీదున్నట్లు పేరును నమోదు చేయాలి. జెండర్ సెలక్ట్ చేసుకోవాలి. పుట్టిన సంవత్సరం ఎంటర్ చేయాలి. ఈ వివరాలన్నింటినీ ఎంటర్ చేసిన తర్వాత ‘REGISTER’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మీ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత వ్యాక్సిన్ అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవాలి. నమోదు ప్రక్రియ పూర్తైన తర్వాత మీ వివరాలు అక్కడ కనిపిస్తాయి. స్టేటస్ (Status) ఆప్షన్ వద్దకు వెళ్లి క్లిక్ చేయాలి. Schedule Oppointment for Vaccination పై క్లిక్ చేయాలి. అక్కడ తొలుత రాష్ట్రం పేరును ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత జిల్లా, బ్లాక్, పిన్ కోడ్‌లను ఎంపిక చేసుకోవాలి.



ఈ వివరాలను ఎంపిక చేసుకొని ‘Search’ చేస్తే.. మీకు సమీపంలోని వ్యాక్సినేషన్ కేంద్రాల వివరాలు కనిపిస్తాయి. వాటిలో ఏదైనా ఒక వ్యాక్సిన్ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి.ఎంపిక చేసుకున్న వ్యాక్సిన్ కేంద్రంపై క్లిక్ చేసి, స్క్రోల్ చేస్తే.. ఆ వ్యాక్సిన్ కేంద్రంలో ఏ రోజు, ఎన్ని వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయో వివరాలు కనిపిస్తాయి. మీ వీలును బట్టి వాటిలో నుంచి తేదీని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత ‘CONFIRM’ పై క్లిక్ చేయాలి. వ్యాక్సిన్ కోసం అపాయింట్‌మెంట్ కన్ఫామ్ అయిన తర్వాత ఆ వివరాలు మీకు అక్కడ డిస్‌ప్లే అవుతాయి. అనంతరం ఎంపిక చేసుకున్న సెంటర్ వద్దకు వెళ్లి కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. అయితే..సెంటర్ కు వెళ్లేటప్పుడు రిజిస్ట్రేషన్ సమయంలో ఎంపిక చేసుకున్న ఐడెంటిటీ కార్డును తప్పనిసరిగా తీసుకపోవాలి.