Vaccine Shortage : భారత్ ను వేధిస్తోన్న టీకాల కొరత

భారత్‌ను టీకా కొరత కొనసాగుతుంది. వ్యాక్సిన్ కొరత మధ్యే టీకా మహోత్సవ్‌ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసులు తగ్గిపోవడంతో.. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Vaccine Shortage : భారత్ ను వేధిస్తోన్న టీకాల కొరత

Vaccine Shortage In India

Vaccine shortage in India : భారత్‌ను టీకా కొరత కొనసాగుతుంది. వ్యాక్సిన్ కొరత మధ్యే టీకా మహోత్సవ్‌ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వ్యాక్సిన్ డోసులు తగ్గిపోవడంతో.. నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. మొదటి రోజు చాలా ప్రాంతాల్లో ఇదే జరిగింది. ఇక మూడు రోజుల ఉత్సవ్ పరిస్థితి ఏంటన్నది ప్రశ్నగా మారింది. భారత్‌లో నిన్న ప్రారంభించిన టీకా ఉత్సవ్.. ఒక అడుగు ముందుకు.. నాలుగు అడుగులు వెనక్కి అన్న చందంలా మారింది.

వ్యాక్సిన్లు లేక రాష్ట్ర ప్రభుత్వాలు టీకా కేంద్రాలను షట్ డౌన్ చేసేశాయి. కొన్ని ప్రాంతాల్లో అయితే సాధారణ రోజుల్లో వేసిన వ్యాక్సిన్ల సంఖ్య కంటే టీకా ఉత్సవ్ మొదటి రోజు వేసిన వ్యాక్సిన్ల సంఖ్య మరీ తక్కువగా ఉన్నాయి. నాలుగు రోజల పాటు టీకా ఉత్సవ్ నిర్వహించాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకుంటే.. రాష్ట్రాల్లో మాత్రం ఒక్కరోజు కూడా ఉత్సవ్ జరిగే దాఖలాలు కనిపించడంలేదు.

ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వ్యాక్సిన్ల కొరత కొనసాగుతోంది. తెలంగాణలో ఉత్సవ్‌కు ముందు ప్రతిరోజు లక్ష మందికి పైగా టీకాలు వేశారు. కానీ నిన్న టీకా ఉత్సవ్ మొదటి రోజు మాత్రం కేవలం 85 వేల మందికే టీకాలు వేశారంటే వ్యాక్సిన్ కొరత ఎంతలా ఉందో తెలిసిపోతుంది. రాష్ట్రంలో ఇంకా నాలుగున్నర లక్షల డోసులు మాత్రమే నిల్వ ఉన్నాయని.. అవి అయిపోయేలోగా కేంద్రం మరిన్ని డోసులు పంపించాలని అధికారులు కోరుతున్నారు. ఇక నేడు జరిగే రెండో రోజు టీకా ఉత్సవ్‌కు టీకాలు సరిపోతాయా? లేదా? అన్నది ప్రశ్నగా మిగిలింది.

అటు ఏపీలోనూ సేమ్ సీన్.. ఇవాళో, రేపో రాష్ట్రంలో వ్యాక్సిన్లు అయిపోనున్నాయి. శ్రీకాకుళం మొదలుకుని అనంతపురం వరకూ ఏ జిల్లాల్లో కూడా పూర్తిస్థాయిలో డోసులు అందుబాటులో లేవు. ఇప్పటికే విశాఖ, అనంతపురం, ప్రకాశం జిల్లాల్లో టీకా ఉత్సవ్‌కు బ్రేక్‌ పడింది. రెండో రోజు చాలా ప్రాంతాల్లో టీకా ఉత్సవ్ నిర్వహించే అవకాశాలు కనిపించడం లేదు. విశాఖలో అయితే అసలు టీకా ఊసే ఎత్తడం లేదు అధికారులు. కేంద్రం నుంచి టీకాలు వస్తేనే వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతుందని తేల్చేసి చెబుతున్నారు.

ఇప్పటికే తమకు వ్యాక్సిన్‌లు అందించండి అంటూ మహారాష్ట్ర, ఏపీ, తెలంగాణ, ఢిల్లీ, కేరళ, ఒడిశా, పంజాబ్‌, రాజస్థాన్‌ కేంద్రానికి మొర పెట్టుకున్నాయి. తమ వద్ద ఉన్న డోసులు ఒకటి, రెండు రోజుల్లోనే అయిపోతాయని.. ఆ తర్వాత వ్యాక్సినేషన్‌ను కొసాగించలేమని కుండబద్ధలు కొట్టేశాయి. మరి దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.