India COVID Variant: ఇండియన్ కొవిడ్ వేరియంట్‌పై తక్కువ ప్రభావం చూపిస్తున్న వ్యాక్సిన్లు

ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్ వేరియంట్.. B.1.617 ఇదే. మీడియాలో విస్తృతంగా దీన్ని ఇండియన్ వేరియంట్ అంటూ ప్రచారం జరుగుతుంది.

India COVID Variant: ఇండియన్ కొవిడ్ వేరియంట్‌పై తక్కువ ప్రభావం చూపిస్తున్న వ్యాక్సిన్లు

Vaccines Almost Certainly Less Effective Against Indias Covid Variant Says Top Uk Scientist

India COVID Variant: ఇండియాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొవిడ్ వేరియంట్.. B.1.617 ఇదే. మీడియాలో విస్తృతంగా దీన్ని ఇండియన్ వేరియంట్ అంటూ ప్రచారం జరుగుతుంది. ఈ డబుల్ మ్యూటెంట్ వేరియంట్ లక్షల ప్రాణాలు బలిగొంటుంది. వైరస్ నుంచి తట్టుకుని నిలబడటానికి మనం వేయించుకుంటున్న కోవిషీల్డ్, కోవ్యాగ్జిన్ వ్యాక్సిన్లు ఈ వేరియంట్‌ని అడ్డుకోగలుగుతున్నాయా లేదా అనేదే పెద్ద డౌట్.

ఈ ప్రమాదకర వేరియంట్‌ నుంచి అంతగా కాపాడలేకపోతున్నాయని తెలిసింది. గతేడాది కరోనాను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్లు బాగా పనిచేస్తున్నాయి. ఇమ్యూనిటీ శక్తిని బాగా పెంచుతున్నాయని తేలింది. అలాంటిది ఇప్పుడున్న డబుల్ మ్యూటెంట్‌ విషయంలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయని తేలింది.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR) రిపోర్టుల ప్రకారం… B.1.617 వేరియంట్‌ని ఎదుర్కోవడానికి ఎంత ఎక్కువ యాంటీబాడీస్ ఉత్పత్తి చెయ్యాలో.. అంతలో సగం మాత్రమే ఈ రెండు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేయగలుగుతున్నాయని తెలిసింది. మహారాష్ట్రలో తొలిసారి ఈ స్ట్రెయిన్‌ను గుర్తించారు.

వైరస్ పై పోరాడేందుకు ఆ మాత్రమైనా వ్యాక్సిన్లు సహాయపడుతుండగా అలా చేయడం మంచి పోరాటమే అంటున్నారు సైంటిస్టులు. జనవరి నుంచి… ICMR, పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV)కి చెందిన సైంటిస్టులు… కరోనా పేషెంట్ల నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేస్తున్నారు.

బ్రిటన్ వేరియంట్ B.1.1.7, దక్షిణాఫ్రికా వేరియంట్ B.1.351, P2 అనే బ్రెజిల్ వేరియంట్, B.1.617 వేరియంట్లపై ఈ 2 వ్యాక్సిన్లూ బాగానే పనిచేస్తున్నాయి. కానీ B.1.617 అనే ఇండియన్ వేరియంట్ విషయంలో అంతగా ప్రభావం చూపలేకపోతున్నాయి అంటున్నారు. ఇండియాలో కేసులు ఎక్కువగా వ్యాప్తి చెందడానికి సెకండ్ వేవ్ ఉద్ధృతికీ ఈ వైరస్సే కారణం.

గతేడాది ఏప్రిల్‌లో B.1 అనే వేరియంట్ ఇండియాలో బాగా వ్యాపించింది. దాని బ్లూ ప్రింట్ రెడీ చేశారు. అప్పుడు ఓ షాకింగ్ విషయం తెలిసింది. ఈ వైరస్‌లోని కొన్ని రూపాంతరాలు శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని తప్పించుకొని మరీ వెళ్లగలుగుతున్నాయని తేలింది. అంటే మన యాంటీబాడీలు దీన్ని సరిగా అడ్డుకోలేకపోతున్నాయన్నమాట.

కోవాగ్జిన్ 2 డోసులు వేయించుకున్న వ్యక్తి నుంచి సేకరించిన యాంటీబాడీలను B.1.617 వేరియంట్‌పై ప్రయోగం చేశారు. గతేడాది B.1కి ఎన్ని యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యాయో… అంతకంటే 55 శాతం తక్కువగా ఉత్పత్తి అయ్యాయని తేలింది. కొవీషీల్డ్ విషయానికి వస్తే… B.1 వేరియంట్‌పై ఆ వ్యాక్సిన్ 42.92 శాతం యాంటీబాడీలను ఉత్పత్తి చెయ్యగా… B.1.617 విషయంలో కేవలం 21.9 శాతం యాంటీబాడీలను మాత్రమే ఉత్పత్తి చేసింది.

కోవిషీల్డ్, కోవాగ్జిన్ రెండూ ఒకే రకంగా పనిచేస్తున్నాయని ICMR ఢిల్లీలోని ఎపిడెమియోలజీ డివిజన్‌కి హెడ్ గా ఉన్న డాక్టర్ సమీరన్ పాండా తెలిపారు.