Corona Vaccination : నార్వే జనాభాకు సమానంగా ప్రతీరోజూ దేశంలో టీకాలు

దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల జనాభాకు టీకాలు వేస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇది నార్వే జనాభాకు సమానమని పేర్కొంది. టీకా వేసే ప్రక్రియ 100 మీటర్ల పరుగుపందెం లాంటిది కాదని.. మారథాన్ వంటిదని తెలిపారు.

Corona Vaccination : నార్వే జనాభాకు సమానంగా ప్రతీరోజూ దేశంలో టీకాలు

Corona Vaccination (4)

Corona Vaccination : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతుంది. ప్రతి రోజు 50 లక్షల జనాభాకు టీకాలు వేస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇది నార్వే జనాభాకు సమానమని పేర్కొంది. టీకా వేసే ప్రక్రియ 100 మీటర్ల పరుగుపందెం లాంటిది కాదని.. మారథాన్ వంటిదని తెలిపారు. ఇక ఇప్పటి వరకు 34 కోట్లమందికి మొదటి డోస్ పూర్తైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ వెల్లడించారు.

అమెరికా జనాభాకు సరిసమానంగా వ్యాక్సిన్ పంపిణి చేశామని వివరించారు. టీకా పంపిణీలో దేశం కొత్త రికార్డులు నమోదు చేసినట్లు అగర్వాల్ వివరించారు. జూన్ 21న దేశంలోని 86 లక్షల మందికి పైగా వ్యాక్సిన్ తీసుకున్నారని వివరించారు. ఇక వ్యాక్సినేషన్ వేగం మరింత పెంచేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు అగర్వాల్.

ఈ సమయంలో 75 కోట్ల డోసుల కోవిషీల్డ్, 55 కోట్ల డోసుల కోవాగ్జిన్ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నదన్నారు.