Corona Vaccines : వ్యాక్సిన్ ప్లీజ్, మూతపడిన కేంద్రాలు.. ఒత్తిడి ఉందంటున్న సీరమ్

కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్లకు డిమాండ్‌ పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకూ అంతగా ఆసక్తి చూపించని ప్రజలు... ఇప్పుడు వ్యాక్సినేషన్‌ చేయించుకొనేందుకు ముందుకొస్తున్నారు.

Corona Vaccines  : వ్యాక్సిన్ ప్లీజ్, మూతపడిన కేంద్రాలు.. ఒత్తిడి ఉందంటున్న సీరమ్

Out Of Stock

Out Of Stock : దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్లకు డిమాండ్‌ పెరుగుతోంది. ఇప్పటికే చాలా చోట్ల వ్యాక్సినేషన్ సెంటర్లను మూసివేశారు. మహారాష్ట్రలో కూడా పలు వ్యాక్సిన్‌ కేంద్రాలు మూతపడ్డాయి. ఇప్పటికే పన్వేల్, పుణె పరిధిలో వ్యాక్సినేషన్ కేంద్రాలు మూసేసిన అధికారులు.. ఇప్పుడు ముంబైలోనే అతిపెద్ద టీకా కేంద్రమైన బీకేసీ సెంటర్‌కూ నో బోర్డ్ తగిలించేశారు. ఇక ఒడిశాలో ఉన్న స్టాక్‌ ఈ రోజుతో పూర్తయిపోతుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఒడిశాలో ఏడు వందల వ్యాక్సినేషన్‌ కేంద్రాలను మూసివేశారు. అటు ఢిల్లీ శివారులోని ఘజియాబాద్, నోయిడాలోనూ పలు వ్యాక్సినేషన్ కేంద్రాలు మూతపడ్డాయి. వ్యాక్సిన్ కొరతతోనే మూసివేసినట్లు చెబుతున్నారు అధికారులు.

పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్లు : –
కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో వ్యాక్సిన్లకు డిమాండ్‌ పెరుగుతోంది. కొద్ది రోజుల క్రితం వరకూ అంతగా ఆసక్తి చూపించని ప్రజలు… ఇప్పుడు వ్యాక్సినేషన్‌ చేయించుకొనేందుకు ముందుకొస్తున్నారు. పెద్ద సంఖ్యలో రిజస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. దేశంలో ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సిన్‌ కోసం డిమాండ్‌ అనూహ్యంగా పెరగడం.. అందుకు తగ్గట్టుగా ఉత్పత్తి లేకపోవడంతో కొరత ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులు ఒత్తిడికి లోనవుతున్నారు. మరోపక్క, వ్యాక్సిన్ల నిల్వ నిండుకుంటుండడంతో పలు రాష్ట్రాల్లోని వ్యాక్సినేషన్‌ కేంద్రాలను మూసివేస్తున్నారు.

ఒత్తిడి ఉందంటున్న సీరమ్ : –
తమపై తీవ్రమైన ఒత్తిడి ఉందని కొవిషీల్డ్‌ను తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధినేత ఆదార్ పూనావాలా అన్నారు. కొవిషీల్డ్‌ను తయారు చేసేందుకు ప్రస్తుతమున్న ఉత్పత్తి సామర్థ్యం ఏ మాత్రమూ సరిపోవడం లేదన్నారు. నిజం చెప్పుకోవాలంటే తమపై విపరీతమైన ఒత్తిడి ఉందన్నారు పూనావాలా. సీరమ్‌ సంస్థ ప్రస్తుతం నెలకు 6 నుంచి ఆరున్నర కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను తయారు చేస్తోంది. ఇప్పటి వరకూ 10 కోట్ల డోస్‌లను ఇండియాలో వాడకానికి అందజేసింది. మరో 6 కోట్ల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది.

సౌతాఫ్రికా ఆర్డర్ క్యాన్సిల్ :-
అయినప్పటికీ, దేశంలో వ్యాక్సిన్ అవసరమయ్యే ప్రతి ఒక్కరికీ అందించేందుకు ఎంతో దూరంలో ఉన్నామన్నారు ఆదార్ పూనావాలా. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ కోసం దక్షిణాఫ్రికా ఇచ్చిన ఆర్డర్‌ను సీరం క్యాన్సిల్ చేసింది. అడ్వాన్స్‌ను కూడా తిరిగి ఇచ్చేసింది. అటు వ్యాక్సిన్ ఉత్పత్తి పెంచేందుకు కేంద్రం తమకు 3 వేల కోట్ల రూపాయల సాయం అందించాలని పూనావాలా కోరారు.