Stray Dog Chase : వెంబడించిన కుక్కలు, తప్పించుకునే ప్రయత్నంలో ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో

వీధి కుక్కల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి బైక్ పై నుంచి పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. గుజరాత్ వడోదరలో ఘోరం జరిగింది. పరేశ్ జింగర్. వయసు 42ఏళ్లు. వగోడియా రోడ్ లో నివాసం ఉంటాడు. సోఫా రిపేరీ, డీజే పనులు చేస్తుంటాడు. శుక్రవారం శివాజీ జయంతిలో పాల్గొన్నాడు. శనివారం తెల్లవారుజామున పరేశ్ తన బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు.

Stray Dog Chase : వెంబడించిన కుక్కలు, తప్పించుకునే ప్రయత్నంలో ఘోర ప్రమాదం.. షాకింగ్ వీడియో

Stray Dog Chase : వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. దాడులకు తెగబడుతున్నాయి. వెంట పడి కరుస్తున్నాయి. తీవ్రంగా గాయపరుస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో దాడి చేసి చంపుతున్నాయి. దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కల దాడి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దాంతో వీధి కుక్కలను చూస్తే ప్రాణ భయంతో జనాలు వణికిపోతున్నారు.

తాజాగా వీధి కుక్కల కారణంగా ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యక్తి బైక్ పై నుంచి పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతడు కోమాలో ఉన్నాడు. గుజరాత్ వడోదరలో ఘోరం జరిగింది. పరేశ్ జింగర్. వయసు 42ఏళ్లు. వగోడియా రోడ్ లో నివాసం ఉంటాడు. సోఫా రిపేరీ, డీజే పనులు చేస్తుంటాడు. శుక్రవారం శివాజీ జయంతిలో పాల్గొన్నాడు. శనివారం తెల్లవారుజామున పరేశ్ తన బైక్ పై ఇంటికి వెళ్తున్నాడు.

Also Read..Pig Attacks Kid : షాకింగ్.. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిపై పంది దాడి, తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

ఈ క్రమంలో ఓ వీధి కుక్క పరేశ్ వెంట పడింది. దాంతో అతడు భయపడిపోయాడు. కుక్క ఎక్కడ తనపై దాడి చేస్తుందోనని కంగారుపడ్డాడు. ఈ క్రమంలో బైక్ పై కంట్రోల్ కోల్పోయాడు. అంతే, ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది. బైక్ నుంచి జారి పడ్డాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడు ఎంత దారుణంగా పడ్డాడంటే.. రోడ్డు మీద కొంతదూరం రాసుకుంటూ పోయాడు. బైక్ కూడా కొంత దూరం వరకు రోడ్డు మీద జారుకుంటూ పోయింది.

Attacked By Cow : బాబోయ్.. కొమ్ములతో యువతిని ఎత్తిపడేసిన ఆవు, తలకు తీవ్ర గాయాలు.. వీడియో వైరల్

పరేశ్ జింగర్ వెంటనే ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు స్పృహలో లేడు. ప్రస్తుతం కోమాలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. కుక్క వెంబడించడం, పరేశ్ జింగ్ బైక్ నుంచి పడిపోవడం.. ఇదంతా సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఈ వీడియో చూసి నెటజన్లు షాక్ అవుతున్నారు. చాలా ఘోరంగా కిందపడ్డాడని వాపోతున్నారు. అయ్యో పాపం అని జాలి చూపుతున్నారు. వీధి కుక్క ఎంత పని చేసింది? అని మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని.. వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని, వాటి బారి నుంచి ప్రజలను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.