UPI Transactions : దేశంలో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు

దేశంలో UPI(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)లావాదేవీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఈ ఏడాది అక్టోబర్ లో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీల విలువ

UPI Transactions : దేశంలో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీలు

Upi

UPI Transactions   దేశంలో UPI(యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్)లావాదేవీలు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. ఈ ఏడాది అక్టోబర్ లో రికార్డు స్థాయిలో యూపీఐ లావాదేవీల విలువ 100 బిలియన్ డాలర్లు దాటింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI)సోమవారం విడుదల చేసిన డేటా ప్రకారం..అక్టోబర్ లో 4.2 బిలియన్ల యూపీఐ లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల విలువ 7.71లక్షల కోట్లు(103బిలియన్ డాలర్లు). యుపీఐ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ప్రతి నెల యూపీఐ లావాదేవీల పరిమాణం 15 శాతం పెరుగుతుండగా, అక్టోబర్ నెలలో మాత్రం లావాదేవీల విలువ 18.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది.

ఇక, సెప్టెంబర్ నెలలో రూ.6.5లక్షల కోట్ల విలువైన 3.6 బిలియన్ యూపీఐ లావాదేవీలు జరిగాయి. అంటే అక్టోబర్ లో యూపీఐ లావాదేవీల పరిమాణం 15 శాతం పెరుగగా, లావాదేవీల విలువ 18.5 శాతం పెరుగుదలను నమోదు చేసింది. యూపీఐ లావాదేవీల సంఖ్య మరియు విలువ గత సంవత్సరం ఈ సమయం కంటే రెట్టింపు కంటే ఎక్కువ.

కాగా, 2016లో యూపీఐ సేవలు ప్రారంభమవగా.. కరోనా మహమ్మారి తర్వాత వీటి వినియోగం భారీగా పెరిగింది. 2019 అక్టోబర్ నెలలో మొదటిసారి 1 బిలియన్ లావాదేవీలను యూపీఐ దాటింది. అక్టోబర్ 2020లో యూపీఐ మొదటిసారిగా 2 బిలియన్లకు పైగా లావాదేవీలను నమోదు చేసింది. ఆ తర్వాత 3 బిలియన్ల లావాదేవీలను చేరుకోవడానికి 10 నెలల సమయం మాత్రమే పట్టింది. ఇక నెలకు 3 బిలియన్ల నుంచి 4 బిలియన్ లావాదేవీలను చేరుకోవడానికి కేవలం 3 నెలలు మాత్రమే పట్టింది.

ALSO READ Punjab Election : కొత్త పార్టీ పేరు ప్రకటించిన అమరీందర్ సింగ్