రెండు వారాలు సీట్లు లేవు : వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలి జర్నీ ప్రారంభం

  • Published By: venkaiahnaidu ,Published On : February 17, 2019 / 06:11 AM IST
రెండు వారాలు సీట్లు లేవు : వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలి జర్నీ ప్రారంభం

మేక్ ఇన్ ఇండియాలో భాగంగా పూర్తి స్వదేశీ  పరిజ్ణానంతో తయారైన దేశీయ మొదటి సెమీ హైస్పీడ్ రైటు వందే భారత్ ఎక్స్ ప్రెస్(ట్రెయిన్-18) తొలి కమర్షియల్ రన్ ఇవాళ(ఫిబ్రవరి-17,2019) ప్రారంభమైంది. ప్రయాణికులతో కలిసియ ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి వారణాశి బయల్దేరింది. రెండు వారాలకు టికెట్లు ఇప్పటికే అమ్ముడుపోయాయి. మొదటి రోజు నుంచే రైలు బోగీలు నిండిపోయాయని, మరో రెండు వారాల వరకు టికెట్లు దొరకవని రైల్వే మంత్రి పియూష్ గోయల్ ట్వీట్ చేశారు.అలహాబాద్ కాన్పూర్ రైల్వే స్టేషన్ లలో ఈ రైలు ఆగనుంది.

శుక్రవారం(ఫిబ్రవరి-15,2019) ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ వందే భారత్ ఎక్స్ ప్రెస్ కు పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. అయితే ప్రారంభించిన మరుసటి రోజే శనివారం ఉదయం వారణాశి ఢిల్లీ వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా కొద్ది సేపు ఆగిపోయింది.