Vande Bharat Express Train: ఇండియన్ రైల్వే ప్రయాణికులకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

ఇండియన్ రైల్వేస్ 2022 నాటికి అప్‌గ్రేడెడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను రెడీ చేయనున్నాయి. న్యూ కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్స్ తో రానున్నాట్లు ఇంగ్లీష్ మీడియా చెప్పనుంది. గతంలో ఉన్న ఫీచర్లతో పాటు మరిన్ని లాంచ్ చేస్తున్నట్లుగా తెలియజేసింది.

Vande Bharat Express Train: ఇండియన్ రైల్వే ప్రయాణికులకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Vande Bharat Express Inside

Vande Bharat Express Train: ఇండియన్ రైల్వేస్ 2022 నాటికి అప్‌గ్రేడెడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను రెడీ చేయనున్నాయి. న్యూ కంఫర్ట్, సేఫ్టీ ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్స్ తో రానున్నాట్లు ఇంగ్లీష్ మీడియా చెప్పనుంది. గతంలో ఉన్న ఫీచర్లతో పాటు మరిన్ని లాంచ్ చేస్తున్నట్లుగా తెలియజేసింది. మార్చి 2022వరకూ లాంచ్ అయి జూన్ 2022నాటికి కమర్షియ్ ట్రైన్ గా మారనుంది. ఇందులో ప్యాసింజర్ కంఫర్ట్ తో పాటు సేఫ్టీ గురించి కూడా ప్లాన్ చేస్తున్నారు.

* సీట్లకు పుష్‌బ్యాక్ అరేంజ్మెంట్ సిస్టమ్
* బ్యాక్టీరియా ఫ్రీ ఎయిర్ కండీషనింగ్ సిస్టమ్
* క్లైమెట్ కంట్రోల్ చేయడానికి, ఎలక్ట్రికల్, విటల్ సిస్టమ్స్ కోసం సెంట్రలైజ్‌డ్ కోచ్ మానిటరింగ్ సిస్టమ్
* ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాడుకోవడం కోసం నాలుగు ఎమర్జెన్సీ విండోస్
* వర్షాకాలంలో వరదల నుంచి రక్షణ కోసం అండర్ ఫ్రేమ్ ఎక్విప్‌మెంట్
* మిగిలిన లైట్లన్నీ ఫెయిలైనా ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా నాలుగు డిజాస్టర్ లైట్స్
* పవర్ ఫెయిల్యూర్ అయినప్పటికీ నాలుగు ఎమర్జెన్సీ పుష్ బటన్స్
* ఫైర్ సర్వైవల్ కేబుల్స్ తో.. ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, డోర్ సర్క్యూట్స్ గురించి ప్యాసింజర్లతో కమ్యూనికేషన్.

వందేభారత్ ట్రైన్​లో 16 కోచ్​లు ఉంటుండగా.. సెమీ హైస్పీడ్​ ట్రైన్స్​గా నడుస్తున్నాయి. సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్​కు ఇంజిన్ తో పనిలేకుండానే ట్రాక్షన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ విధానం అనుసరించి పనిచేస్తాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ టెక్నాలజీనే వాడుతున్నారు. వందేభారత్​ ట్రైన్లు భారత ఆధునిక రైళ్లలో వలే సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. ఆటోమేటిక్​ డోర్లు, విమానాల్లో ఉండేలాంటి సీట్లతో పాటు ప్రయాణికులకు సదుపాయాలు కల్పించేందుకు అనేక ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఇండియన్ రైల్వేస్ రెండు వందేభారత్ ట్రైన్స్ ను ఆపరేట్ చేస్తుంది. ఢిల్లీ నుంచి వారణాసి, ఢిల్లీ నుంచి కత్రాకు మరొకటి. ఈ రెండింట్ మధ్య ట్రావెలింగ్ టైం ముందుగా ఉండే 12 నుంచి 14గంటల సమయాన్ని 8గంటలకు కుదించారు. ఇందులో లాంగ్ డిస్టెన్స్ రూట్ల కోసం స్లీపర్ క్లాసులకు బదులుగా చైర్ కార్ సర్వీసులకు అనుమతించారు.