Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు కేసులో వాదనలు విన్న సుప్రీం కోర్టు

జ్ఞానవాపి మసీదు - కాశీ విశ్వనాథ్ గుడి కాంప్లెక్స్ వివాదంలో వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును మే24కు వాయిదా వేసింది. పెండింగ్ లో ఉన్న ప్రొసీడింగ్స్‌ను శుక్రవారేమే 20వ తేదీన సివిల్ జడ్జి కోర్టు నుంచి జిల్లా జడ్జికి ట్రాన్సపర్ చేసింది సుప్రీం కోర్టు. కేసును సీనియర్ న్యాయవాది హ్యాండిల్ చేస్తారని చెప్పింది.

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు కేసులో వాదనలు విన్న సుప్రీం కోర్టు

Gyanvapi

Gyanvapi Mosque: జ్ఞానవాపి మసీదు – కాశీ విశ్వనాథ్ గుడి కాంప్లెక్స్ వివాదంలో వాదనలు విన్న సుప్రీం కోర్టు తీర్పును మే24కు వాయిదా వేసింది. పెండింగ్ లో ఉన్న ప్రొసీడింగ్స్‌ను శుక్రవారేమే 20వ తేదీన సివిల్ జడ్జి కోర్టు నుంచి జిల్లా జడ్జికి ట్రాన్సపర్ చేసింది సుప్రీం కోర్టు. కేసును సీనియర్ న్యాయవాది హ్యాండిల్ చేస్తారని చెప్పింది.

ఈ మేరకు సోమవారం వారణాసి కోర్టులో విచారణ ప్రారంభమైంది. జ్ణానవాపి మసీదు గోడలపై ఉన్న శృంగేరీ దేవీతో పాటు ఇతర దేవతా మూర్తులకు పూజలు చేసుకునేందుకు అనుమతివ్వాలంటూ 5గురు మహిళలు పిటీషన్ దాఖలు చేశారు. పిటీషన్ ను విచారించిన సివిల్ జడ్జి వీడియోగ్రఫీ సర్వేకి ఆదేశాలు ఇచ్చారు.

జ్ణానవాపి మసీదులో దేవాలయానికి సంబంధించిన ఆనవాళ్లు ఉన్నట్లు అందులోనే వెల్లడైంది. మసీదులోని బావిలో శివలింగం ఉన్నట్లు వీడియోగ్రఫీ సర్వేలో గుర్తించారు. శివలింగం ఉన్న ప్రాంతాన్ని పరిరక్షించాలని ఆదేశం ఇచ్చిన సుప్రీం కోర్టు… అదే సమయంలో ముస్లింలకు నమాజుకు ఎటువంటి ఆటంకం కలిగించవద్దొందటూ సూచించింది.

Read Also: జ్ఞానవాపి మసీదు గురించి పోస్టు పెట్టిన ప్రొఫెసర్ అరెస్ట్

ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేయాలంటూ మసీదు కమిటీ వాదన వినిపిస్తూ.. ప్రార్ధనా స్థలాల చట్టం 1991 అమలులో ఉందని ప్రస్తావించింది. జ్ణానవాపి మసీదుపై దాఖలైన పిటీషన్ విచారణార్హం కాదంటూ కోర్టులో మసీదు కమిటీ న్యాయవాది వాదనలు వినిపిస్తున్నారు.