Gyanvapi Survey: జ్ఞానవాపి మసీదు సర్వే విషయంలో ట్విస్ట్, రెండ్రోజులే గడువిచ్చిన కోర్టు

జ్ఞానవాపి మసీదు సమీపంలో జరిపిన సర్వేను రెండ్రోజుల్లోగా వారణాసి కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశాలు అందాయి. వారణాసిలోని సివిల్ కోర్ట్ దీనిపై విచారణ జరిపి సర్వేల్లో పాల్గొంటున్న ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రానుు విధుల్లో నుంచి తప్పించింది.

Gyanvapi Survey: జ్ఞానవాపి మసీదు సర్వే విషయంలో ట్విస్ట్, రెండ్రోజులే గడువిచ్చిన కోర్టు

Gyanvapi

Gyanvapi Survey: జ్ఞానవాపి మసీదు సమీపంలో జరిపిన సర్వేను రెండ్రోజుల్లోగా వారణాసి కోర్టుకు సమర్పించాలంటూ ఆదేశాలు అందాయి. వారణాసిలోని సివిల్ కోర్ట్ దీనిపై విచారణ జరిపి సర్వేల్లో పాల్గొంటున్న ముగ్గురు కమిషనర్లలో ఒకరైన అజయ్ మిశ్రానుు విధుల్లో నుంచి తప్పించింది. మిశ్రా అసిస్టెంట్ సర్వే వివరాలను మీడియాకు తెలియజేయడాన్ని సీరియస్ గా తీసుకున్న కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది.

విశాల్ సింగ్, అజయ్ ప్రతాప్ అనే ఇద్దరు అధికారులు కోర్ట్ కమిషనర్, డిప్యూటీ కోర్ట్ కమిషనర్ గా కొనసాగుతారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయ సమీపంలోని జ్ఞానవాపి మసీదు గురించి సుదీర్థ కాలంగా పోరాటం జరుగుతూనే ఉంది. గుడిని పడగొట్టి మసీదు నిర్మించారనే ఆరోపణలు రావడంతో వారణాసి కోర్టు ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాను వివరాలు తెలుసుకోవాలని ఆదేశించింది.

కాశీ విశ్వనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి 16వ శతాబ్దంలో మొగల్ చక్రవర్తి అయిన ఔరంగజేబు మసీదు నిర్మాణం చేశారంటూ సుప్రీం కోర్టులో, అలహాబాద్ హైకోర్టులో, వారాణాసి కోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Read Also: జ్ఞానవాపి మసీదులో శివలింగం.. సీజ్ చేయాలన్న కోర్టు

పిటిషనర్లు, స్థానిక పూజారులు జ్ఞాన్వాపి మసీదు సముదాయంలో పూజలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వారణాసి కోర్టులో 1991లో తొలి పిటిషన్ దాఖలైంది.

వారణాసికి చెందిన విజయ్ శంకర్ రస్తోగి అనే న్యాయవాది జ్ఞానవాపి మసీదు నిర్మాణంలో చట్టవిరుద్ధమని పేర్కొంటూ దిగువ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మసీదు నిర్మాణంపై వివరణ వచ్చేలా పురావస్తు శాఖ సర్వే నిర్వహించాలని కోరారు. ఇది డిసెంబర్ 2019లో అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామజన్మభూమి టైటిల్ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత వచ్చింది.