Covid-19 Test : కరోనా మాయ : అమ్మకు నెగిటివ్..పుట్టిన బిడ్డకు పాజిటివ్

Covid-19 Test : కరోనా మాయ : అమ్మకు నెగిటివ్..పుట్టిన బిడ్డకు పాజిటివ్

Covid 19 Test

newborn baby test positive..mother  negative : కరోనా మహమ్మారి ఎన్ని రకాలుగానో రూపాంతరం చెందుతోంది.దాని మనుగడ కోసం పలు రకాలుగా దాడి చేస్తోంది. ఆయా వాతావరణాలను బట్టి..శరీర తత్వాలను బట్టి దారి ప్రభావం ఉంటుంది. ఈ క్రమంలో గర్భిణి అయిన ఓ మహిళ ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరింది. పండంటి బిడ్డకు జన్మ ఇచ్చింది. ఈ కరోనా సమయంలో ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన ఆమెకు కరోనా టెస్ట్ లు చేయగా ఆమెకు నెగిటివ్ వచ్చింది. అనంతరం ఆమెకు ప్రసవం చేయగా బిడ్డను జన్మనిచ్చింది. కానీ పుట్టిన బిడ్డకు పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీన్ని బట్టే తెలుస్తోంది కరోనా మహమ్మారి చేసే మాయలేంటో..

గర్భంతో ఉన్న మహిళకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయినా.. ప్రసవం తర్వాత బిడ్డలో వైరస్‌ లక్షణాలు అత్యంత అరుదుగా కన్పిస్తాయని వైద్య నిపుణులు తెలిపారు. కానీ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో దీనికి పూర్తి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది. తల్లికి కరోనా నెగిటివ్ ఉన్నా..పుట్టిన బిడ్డకు మాత్రం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావటంతో డాక్టర్లు షాక్ అయ్యారు.

వారణాసిలోని కంటోన్మెంట్‌ ప్రాంతానికి చెందిన 26 ఏళ్ల గర్భిణి ప్రసవం కోసం మే 24న బనారస్‌ హిందూ యూనివర్శిటీ ఆసుపత్రిలో చేరింది. వెంటనే ఆమెకు కరోనా పరీక్షలు చేయగా.. నెగెటివ్‌గా తేలింది. మే 25న ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కానీ పుట్టిన శిశువులో కరోనా లక్షణాలు కన్పించడంతో డాక్టర్లకు అనుమానం వచ్చి వెంటనే పరీక్షలు చేయగా..పాజిటివ్‌గా రిపోర్ట్ రావటంతో వారు షాక్ అయ్యారు. అదే విషయం ఆమె కుటుంబ సభ్యులకు చెప్పగా వారు ఆందోళనచెందారు. కానీ చేసేదేముంది శిశువును అబ్జర్వేషన్ లో ఉంచారు.

ఈ ఘటనపై డాక్టర్లు మాట్లాడుతూ..చాలా అసాధారణమైన విషయమని తాముబిడ్డకు పాజిటివ్ వస్తుందని అనుకోలేదని ఆసుపత్రి సూపరిండెంట్‌ డాక్టర్‌ కేకే గుప్తా తెలిపారు. తల్లీబిడ్డకు మరోసారి కరోనా టెస్టులు చేస్తామని..ప్రస్తుతం తల్లీ బిడ్డలిద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు.