పాములతో ఆడుకునే వాడు.. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు

ఓ పాము విషయంలో కథ అడ్డం తిరిగింది. ఇన్నాళ్లూ వేటిని రక్షించడానికి కష్టపడ్డాడో.. ఇప్పుడు ఆ పాము కాటుతోనే అతను పేషెంట్ అయ్యాడు.

పాములతో ఆడుకునే వాడు.. ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు

ఓ పాము విషయంలో కథ అడ్డం తిరిగింది. ఇన్నాళ్లూ వేటిని రక్షించడానికి కష్టపడ్డాడో.. ఇప్పుడు ఆ పాము కాటుతోనే అతను పేషెంట్ అయ్యాడు.

పాము.. ఈ పేరు వింటేనే ప్రాణం పోయినంత పనౌతుంది. ఆ దరిదాపుల్లో కూడా మనిషి కనిపించడు. కానీ అతనికి మాత్రం .. ప్రాణం లేచొస్తుంది. దాన్ని పట్టుకునే వరకూ అసలు ఊరుకోడు. అలా కాటేసి.. ఇలా ప్రాణాలు హరించే కింగ్‌ కోబ్రా(king cobra) అయినా .. అతని ముందు తలవంచి నాగినీ నృత్యం చేయాల్సిందే. అసలు అతని పేరు వింటేనే .. కేరళలో ఎక్కడి పాములు అక్కడ .. పుట్టల్లో భయంతో పడుకోవలసిందే. 50వేల నాగులూ, 180 కోబ్రాలు పట్టిన రికార్డ్‌. అతనే కేరళ రాష్ట్రం తిరువనంతపురానికి చెందిన .. వావా సురేష్‌. (vava suresh)

స్కూల్ వయసులోనే కోబ్రా పట్టాడు:
చిన్నపిల్లలకు ఆట బొమ్మలంటే ఇష్టం. వాటితో ఆడుకోవడమంటే ఇంకా ఇష్టం. కానీ ఆవయసులో సురేష్‌కు మాత్రం పాములంటే ప్రాణం. వాటిని పట్టుకోవడమే అతనికి ఆట. ప్రతీ ఒక్కరూ స్కూలుకు పరుగులు పెడుతుంటే.. ఆ వయసులో అతను మాత్రం పాముల వెంట పరుగులు పెట్టేవాడు.

13 అడుగుల కోబ్రాను అయినా ఇట్టే సైలెంట్‌ చేసేస్తాడు. పడగెత్తి బుసలుకొట్టే నాగులనూ బొజ్జోపెడతాడు. అసలు అతడంటేనే పాములకు టెర్రర్‌. ఇప్పటివరకూ 180 కోబ్రాలను పట్టుకున్న సురేష్‌.. తొలి కోబ్రాను స్కూలు వయసులోనే పట్టేశాడు.

2

ఎన్నోసార్లు కాటేసినా వెనకడుగు వేయలేదు:
పాము కనిపించిందంటూ ఒక్క ఫోన్‌ చేశారో.. నిమిషాల్లో అక్కడ వాలేస్తాడు. వెంటనే పట్టుకుని సురక్షిత ప్రాంతంలో వదిలిసేస్తాడు. కేరళలో వరదలు వచ్చిన సమయంలోనూ .. జనావాసాల్లో ఎన్నో పాములను పట్టుకుని .. అడవిలో వదిలిపెట్టాడు.. సురేష్‌. అలా ఇప్పటివరకూ 50వేల పాములను పట్టుకున్నాడు. పాములు పట్టే క్రమంలో ఎన్నో సార్లు అవి అతడిని కోపంతో కాటేశాయి. కానీ సురేష్‌ మాత్రం వెనుకడుగు వేయలేదు.

కాటేసిన రక్తపింజరి:
వేల పాముల వేటలో .. వందల సార్లు అతడిని పాములు కాటేశాయి. అన్నిసార్లూ అతను మందులు వేసుకుని ప్రాణాలను కాపాడుకున్నాడు. కానీ ఓ పాము విషయంలో కథ అడ్డం తిరిగింది. ఇన్నాళ్లూ వేటిని రక్షించడానికి సురేష్‌ కష్టపడ్డాడో.. ఇప్పుడు ఆపాము కాటుతోనే అతను పేషెంట్ అయ్యాడు.

ఈ మధ్యే ఓ రెస్క్యూ ఆపరేషన్‌లో రిస్క్‌ చేయడంతో.. రక్తపింజరి(pit viper) కాటేసింది. అయితే… సురేశ్‌కు యాంటీ వీనమ్‌ ఇంజెక్షన్‌ ఇచ్చారు. కానీ ఇప్పటికే చాలాసార్లు ఆ మందు వాడటంతో.. ఇప్పుడు ఆ మెడిసిన్‌కు అతని శరీరం సహకరించడం లేదు. 72 గంటలు గడిస్తేకానీ ఏం చెప్పలేం అంటున్నారు డాక్టర్లు.

ప్రాణాపాయ స్థితిలో సురేష్:
46 ఏళ్ల సేరేష్‌.. ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో ఉన్నాడు. ఇన్నాళ్లుగా.. ఇన్నేళ్లుగా పాముల చుట్టూ అల్లుకున్న జీవితం .. పాములనే నేస్తాలుగా మలుచుకున్న ప్రాణం. కానీ ఏ పాములో ఏ విషం వుందో ఎవరికి తెలుసు. చివరకు ఆ పాము కాటే.. అతని జీవితంలో విషాన్ని నింపింది. పామే కదా అనుకుంటే .. ప్రాణం మీదకు తెచ్చింది.

36

Read  More>>రైతుకు రూ.3లక్షల పంట రుణం,సైబర్ క్రిమినల్స్ టార్గెట్ వాళ్లే..