Vedic Paint : ఆవు పేడతో పెయింట్, గడ్కరీ ట్వీట్

Vedic Paint : ఆవు పేడతో పెయింట్, గడ్కరీ ట్వీట్

Vedic Paint made out of cow dung : పెయింట్‌లలో సంచలనం. ఆవు పేడతో ఓ పెయింట్‌ను తయారు చేశారు. దీనిని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పరిచయం చేశారు. దీనికి వేదిక్ పెయింట్ (Vedic Paint) అని పేరు పెట్టారు. అతి త్వరలోనే దీనిని లాంచ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు గడ్కరి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేశారు. రైతులను అదనపు ఆదాయం సమకూరుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారాయన. ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్ ద్వారా ఈ పెయింట్ తయారవుతోందని, పాడి రైతులు అదనంగా ఏడాదికి రూ. 55 వేలు సంపాదిస్తారని గడ్కరి వెల్లడించారు.

గ్రామీణ ప్రాంత ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. డిస్టెంబర్ (distemper), ఎమల్షన్ (emulsion) రూపాల్లో అందుబాటులో ఉంటుందని, పెయింట్ వేసిన అనంతరం నాలుగు గంటల్లోనే ఆరిపోతుందన్నారు. పర్యావరణ హితమైన ఈ పెయింట్ విషరహిత, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉందన్నారు. చాలామందికి విచిత్రంగా అనిపించినా…Kumarappa National Handmade Paper Institute నిపుణులు కొన్ని సంవత్సరాలుగా దీనిని అభివృద్ధి చేస్తున్నారు.

Giriraj Singh (Minister of Animal Husbandry, Dairying and Fisheries) ఫేస్ బుక్ లో 2019 ఆగస్టులో దీనికి సంబంధించి ఓ పోస్టు చేశారు. పశువుల రైతుల నుంచి ఆవు పేడను కేజీకి రూ. 5 చొప్పున కొనుగోలు చేస్తామని వెల్లడించారాయన.