Mud Home : బాత్రూమ్ లో అర‌టి చెట్ల పెంపకం..ఆ ఇల్లు ప్రకృతికి పుట్టిల్లు..

ఈ కాంక్రీట్ జంగిల్ కాలంలో వీణాలాల్ మట్టితో ఇల్లు కట్టుకున్నారు. వీణాలాల్ ఇల్లు చూస్తే ఇది ఇల్లా? నర్సరీయా?అనిపిస్తుంది. ఇంటినిండా ఎక్కడ చూసినా మొక్కలే. ఆఖరికి బాత్రూమ్ లో కూడా మొక్కలే. కాదు కాదు చెట్లే. చెట్లు అంటే అరటి చెట్లు. ఎవరన్నా ఇంటిలో మొక్కలు పెంచుకుంటారు.

Mud Home : బాత్రూమ్ లో అర‌టి చెట్ల పెంపకం..ఆ ఇల్లు ప్రకృతికి పుట్టిల్లు..

Veena Lal Unique Mud Home Has No Acs Water Less Toilets Banana Trees In Bathrooms

Mud Home : సొంత ఇల్లు కట్టుకోవాలి. కానీ ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి. కొంతమంది గ్రాండ్ లుక్ తో ఉండే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. కొంతమంది పచ్చదనంతో కళకళలాడే ఇల్లు కట్టుకోవాలనుకుంటారు. ప్రకృతి ప్రేమికులు పచ్చదనం ఇంటికే మొగ్గుచూపుతారు. అటువంటివారే ఫ‌రీదాబాద్ కు చెందిన వీణా లాల్. పచ్చదనం అంటే ఇష్టపడేవారు ప్రకృతి ఒడిలో ఇల్లు కట్టుకోవాలని ఆశపడతారు. కానీ కట్టుకున్న ఇంటినే ప్రకృతిలా మార్చేసారు వీణాలాల్. ఈ కాంక్రీట్ జంగిల్ కాలంలో వీణాలాల్ మట్టితో ఇల్లు కట్టుకున్నారు. ఇల్లు కట్టడానికి ఉపయోగించిన ఇటుకలు కూడా మట్టివే. ఆ మట్టి ఇంటిలో ప్రకృతి కొలువుతీరేలా డిజైన్ చేసుకున్నారు. వీణాలాల్ ఇల్లు చూస్తే ఇది ఇల్లా? లేకా నర్సరీయా?అనిపిస్తుంది. ఇంటినిండా ఎక్కడ చూసినా మొక్కలే. ఆఖరికి బాత్రూమ్ లో కూడా మొక్కలే. కాదు కాదు చెట్లే. చెట్లు అంటే అరటి చెట్లు. ఎవరన్నా ఇంటిలో మొక్కలు పెంచుకుంటారు. కానీ వీణాలాల్ మాత్రం ఏకంగా చెట్లే పెంచేస్తున్నారు.అది బాత్రూమ్ లో కూడా. అందకే ఆ ఇంటిని గ్రీన్ హౌస్ అంటారు.

2

54 ఏళ్ల వీణాలాల్ 2003లో డ్రీమ్ హోమ్ ను క‌ట్టుకోవటానికి స్థ‌లం తీసుకున్నారు. ప్ర‌కృతికి ఇబ్బంది కలిగించకుండా ఇల్లుకట్టుకోవాలనుకున్నారు. ప్ర‌కృతి నుంచి వ‌చ్చే ఏది వేస్ట్ చేయ‌కూడ‌దని నమ్మే అత్యంత ప్రకృతి ప్రేమికురాలు వీణాలాల్. ప్ర‌కృతికి ద‌గ్గ‌ర‌గా ఉండేలా ఇల్లును నిర్మించుకున్నారు వీణ‌.కానీ ఈ రోజుల్లో అటువంటి ఇల్లు డిజైన్ చేసేవారు చాలా తక్కువమంది ఉంటారు. అటువంటి వారి కోసం తెలుసుకుని ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ అమోల్ మానెక‌ర్ గురించి తెలుసుకున్నారు. ఆయన్ని సంప్ర‌దించి త‌న డ్రీమ్ హోమ్ గురించి చెప్పారు వీణ.

Mud Home

ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించ‌ని ఇల్లు కట్టుకోవాలని చెప్పటంతో ఆయన ఇచ్చిన ప్లాన్ తో మూడేళ్ల కింద ‘ డ్రీమ్ హోమ్(మట్టితో కట్టిన ఇల్లు)’ ను నిర్మించ‌ుకోగలిగారు వీణ‌. అలా 1800 చ‌ద‌ర‌పు గ‌జాల స్థ‌లంలో పొదరిల్లులాంటి మ‌ట్టి ఇల్లు నిర్మించుకున్నారు. ఉత్త మట్టితోనే కడితే వర్షాకాలంలో ఇబ్బంది ఉంటుంది. దీంతో చాలా చాలా సిమెంట్ మోతాదును ఉప‌యోగించి..ఇల్లును నిర్మించుకున్నారు. దానికి గ్రీన్ హోమ్ గా పేరు పెట్టుకున్నారు.పేరుకు తగినట్లుగా అది నిజంగా పచ్చదనం వర్థిల్లే ఇల్లే.మట్టితో చేసి ఎండ‌బెట్టిన ఇటుక‌ల‌ను (ఇటుకలు కాల్చకుండా)ఉప‌యోగించి ఇల్లును నిర్మించి.. గోడ‌ల‌ను మ‌ట్టితో ప్లాస్ట‌ర్ చేయించారు. దీంతో ఇల్లు ఎప్పుడూ చల్లగా ఉంటుంది వేసవిలో కూడా. ఫ్యాన్లు, ఏసీల అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఆ ఇటుక‌ల‌ను కూడా త‌నే సొంతంగా మ‌ట్టితో త‌యారు చేసుకోవటం మరో విశేషం. స్లాబ్ ను లోక‌ల్ గా టైల్స్ తోను,పెద్ద పెద్ద రాళ్ల‌తో ఫ్లోరింగ్ వేయించారు. ఆ గ్రీన్ హౌస్ లో వాష్ బేసిన్స్, కిచెన్ సింక్స్ అన్నీ రాతితో చేసిన‌వే.

1

రెండు బాత్ రూమ్స్, ఒక డ్రాయింగ్ రూమ్, కిచెన్, స‌ప‌రేట్ డ్రై టాయిలెట్ ను ప్లాన్ చేసి కట్టించారు వీణ‌. టాయిలెట్ లో ఎక్కువ‌గా నీళ్లు ఉప‌యోగించాల్సిన అవ‌స‌రం లేకుండా.. ఫ్ల‌ష్ ను డైరెక్ట్ గా డ్ర‌మ్ కు లింక్ చేశారు. అలాగే.. త‌న టాయిలెట్ లో అరటి చెట్టుతో పాటు క్రోటన్స్ మొక్కలు పెంచుతున్నారు వీణ‌. అర‌టి చెట్టు వేర్లు టాయిలెట్ వాట‌ర్ ను క్లీన్ చేస్తాయి. అందుకే.. బాత్ రూమ్ లో అర‌టి చెట్ల‌ను పెంచుతున్నాను అంటారామె. ఇంటికి సోలార్ ప‌వ‌ర్ క‌నెక్ష‌న్ తో ఈ కాంక్రీట్ జంగ‌ల్ లో గ్రీన్ హోమ్ ను నిర్మించి అంద‌రికీ ఆద‌ర్శంగా నిలుస్తున్నారు వీణాలాల్.