Non-Veg Pizza to Vegetarian Woman : వెజ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ పిజ్జా డెలివరీ చేసిన రెస్టారెంట్.. కోటి నష్టపరిహారం డిమాండ్ చేసిన మహిళ

ఆమె వెజిటేరియన్.. పిజ్జా కోసం ఓ రెస్టారెంటుకు ఆర్డర్ పెట్టింది.. వెజ్‌కు బదులుగా నాన్ వెజ్ పిజ్జాను డెలివరీ చేసింది. ఆగ్రహంతో ఆ మహిళ.. రెస్టారెంటును కోటి రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ డిమాండ్ చేసింది.

Non-Veg Pizza to Vegetarian Woman : వెజ్ ఆర్డర్ చేస్తే.. నాన్ వెజ్ పిజ్జా డెలివరీ చేసిన రెస్టారెంట్.. కోటి నష్టపరిహారం డిమాండ్ చేసిన మహిళ

One Crore Compensation From Restaurant

One Crore Compensation for Non-Veg Pizza : ఆమె వెజిటేరియన్.. పిజ్జా కోసం ఓ రెస్టారెంటుకు ఆర్డర్ పెట్టింది.. అయితే ఆ రెస్టారెంట్ వెజ్‌కు బదులుగా నాన్ వెజ్ పిజ్జాను డెలివరీ చేసింది. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన ఆ మహిళ.. రెస్టారెంటును కోటి రూపాయలు నష్టపరిహారంగా చెల్లించాలంటూ డిమాండ్ చేసింది. వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. తమ మత విశ్వాసాలను దెబ్బతినేలా రెస్టారెంట్ వ్యవహరించందంటూ మహిళ వినియోగదారుల కోర్టుకు విన్నవించుకుంది.

యూపీలోని ఘజియాబాద్‌కు చెందిన దీపాళీ త్యాగి అనే మహిళ ప్యూర్ వెజిటేరియన్. తన సిద్ధాంతాలు, కుటుంబ సాంప్రదాయాల ప్రకారం నాన్ వెజ్ ఆహారం ముట్టుకోనని తన ఫిర్యాదులో పేర్కొంది. రెస్టారెంట్ ఔట్ లెట్ పంపిన నాన్ వెజ్ పిజ్జా తెలియక ఇంట్లో అందరూ తినేశారని, ఆ తర్వాతే అది నాన్ వెజ్ అని తెలిసిందని ఆరోపించింది. 2019 మార్చి 21న పిజ్జా కోసం ఆర్డర్‌ చేసింది.

ఆ రోజు హోలీ. పిల్లలంతా ఆడుకొని ఆకలితో ఉండటంతో పిజ్జా అర్డర్‌ చేసినట్టు పేర్కొంది. ప్యాకింగ్‌ తెరిచేసరికి అందులో నాన్‌వెజ్‌ పిజ్జా ఉంది. వెంటనే కస్టమర్‌ కేర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదు. దాంతో లాయర్‌ సహాయంతో వినియోగదారుల కోర్టుకెక్కింది. అమెరికా పిజ్జా కంపెనీ తన మత విశ్వాసాలను దెబ్బతీసిందని వాదించింది. దీనిపై కోర్టు పిజ్జా కంపెనీని వివరణ కోరింది. తదుపరి విచారణ మార్చి 17న జరుగనుంది.