Vehicle Horn : మారనున్న వాహనాల హారన్, ఇకపై వినసొంపైన సంగీతం సౌండ్లు

త్వరలో ప్రజలకు భయంకరమైన హారన్ సౌండ్స్ నుంచి విముక్తి లభించనుంది. హారన్ విధానంలో మార్పులు తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

Vehicle Horn : మారనున్న వాహనాల హారన్, ఇకపై వినసొంపైన సంగీతం సౌండ్లు

Vehicle Horn

ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ తీవ్రత ఎక్కువైంది. దీనికి తోడు హారన్ల సౌండ్ వాహనదారులకు తలనొప్పిగా మారింది. రహగొణధ్వనులతో రహదారుల పక్కన ఉండే వారు విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే హారన్ సినారియోను మార్చేందుకు కేంద్రం సరికొత్త ఆలోచన చేయబోతోంది. విచిత్రమైన, ఘోరమైన శబ్దాలు చేసే హారన్‌ సౌండ్‌ల్ని మార్చేసే దిశగా ఆలోచన చేయనున్నట్లు రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఒక ప్రకటన చేశారు.

ఇప్పుడున్న వెహికిల్‌ హారన్‌ల ప్లేస్‌లో తబలా, వయొలిన్‌, ఫ్లూట్‌ ఇలా రకరకాల వాయిద్యాల శబ్దాలను పరిశీలించబోతున్నట్లు ఆయన తెలిపారు. తొలి దశలో కార్లకు ఈ ఆలోచనను అమలు చేయబోతున్నట్లు, ఈ మేరకు త్వరలో కంపెనీలకు సూచనలు సైతం పంపిచనున్నట్లు గడ్కరీ ఓ మరాఠీ పత్రికకు తెలిపారు.

శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రజలకు అంతుచిక్కని వ్యాధులు వస్తున్నాయి. చెవుడుతోపాటు మానసిక ఆందోళన, ఒత్తిళ్లు, గుండె సంబంధింత వ్యాధులు వస్తున్నాయి. అయితే ఎమర్జెన్సీ యూసేజ్ కోసం ఏర్పాటు చేసిన ఈ హారన్ ఇష్టం వచ్చినట్లు కొట్టడంతో అనేక అనర్దాలు జరుగుతున్నాయి. ఇటువంటి అనర్దాలను దూరం చేసేందుకు కేంద్ర రోడ్దు రవాణా శాఖ నూతన హారన్ విధానానికి శ్రీకారం చుట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రోడ్ల మీద వెళ్లే వాహనాల విషయంలోనే కాదు.. షిప్స్‌, రైళ్ల విషయంలోనూ ఈ నిబంధనలు పాటించాలి. సాధారణంగా రైళ్ల హారన్‌ 130-150 డెసిబెల్స్‌ దాకా ఉంటుంది. దూరం ఉన్నప్పుడు మాత్రమే ఈ శబ్ద తీవ్రతతో హారన్‌ కొట్టాలి. ప్లాట్‌ఫామ్‌ మీదకు వచ్చిన తర్వాత కూడా ఈ రేంజ్‌ సౌండ్‌ హారన్‌ కొట్టడం రూల్స్‌కి వ్యతిరేకం!.