Scrappage Policy: వెహికల్ స్క్రాపేజ్‌ పాలసీ.. 25శాతం రోడ్డు ట్యాక్స్ రద్దు

నూతన వెహికిల్ స్క్రాపేజ్‌ పాలసీ(జాతీయ వాహన తుక్కు విధానం)కి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మరో ప్రకటన చేసింది.

Scrappage Policy: వెహికల్ స్క్రాపేజ్‌ పాలసీ.. 25శాతం రోడ్డు ట్యాక్స్ రద్దు

Scrap

Vehicle Scrappage Policy: నూతన వెహికల్ స్క్రాపేజ్‌ పాలసీ(జాతీయ వాహన తుక్కు విధానం)కి సంబంధించి కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ మరో ప్రకటన చేసింది. కొత్త జాతీయ ఆటోమొబైల్ స్క్రాపేజ్ పాలసీ కింద, పాత వాహనాలను స్క్రాప్ చేసిన తర్వాత కొనుగోలు చేసిన వాహనాల రోడ్ ట్యాక్స్‌పై 25శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించుకుంది.

మంత్రిత్వ శాఖ తరపున, వాహన స్క్రాపింగ్ విధానంలో వాహన యజమానులు పాత వాహనాలను స్క్రాప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతోంది ప్రభుత్వం. అన్ ఫిట్ వాహనాలను తొలగించడమే స్క్రాపేజ్‌ పాలసీ ముఖ్య లక్ష్యం. వాహనాల రిజిస్ట్రేషన్ పరిమితికాలం పూర్తి కాగానే స్క్రాపేజ్‌ పాలసీ అమల్లోకి రానుంది. వాహనాలకు ఫిట్‌నెస్‌ టెస్ట్ నిర్వహించి, మోటార్ వాహన చట్టాల ప్రకారం వ్యక్తిగత వాహనాల జీవితకాలం 15ఏళ్లు కాగా.. వాణిజ్య వాహనాల జీవితకాలం ఎనిమిదేళ్లుగా నిర్ణయించింది ప్రభుత్వం.

రహదారి పన్ను మినహాయింపు ప్రైవేట్ వాహనాలకు 25 శాతం, వాణిజ్య వాహనాలకు 15 శాతం వరకు ఇవ్వబడుతుంది. మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌లో, ఈ కొత్త నిబంధన(24 వ సవరణ) నియమాలు ఉన్నాయి.
ఫిట్‌నెస్ టెస్టు సెంటర్లలో వాహనాల బ్రేకింగ్, ఇంజిన్ పర్ఫామెన్స్ చెక్ చేసి, అన్ని టెస్టులు నిర్వహించి పొల్యూషన్ స్థాయి ఏ లెవెల్ ఉందో నిర్ధారిస్తారు. టెస్ట్‌లో ఫెయిలయితే వాహనదారుడు తమ పాత వాహనాలను రిపేర్ చేయించి మూడుసార్లు టెస్ట్ నిర్వహించవచ్చు.

త్వరలో రాష్ట్రాలకు ఆదేశాలు:
సిస్టమాటిక్ పద్ధతుల ద్వారా పాత వాహనాలను దశలవారీగా రీసైకిల్ చేయడమే స్క్రాపేజ్ పాలసీ లక్ష్యమని కేంద్రం చెబుతుండగా.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని పాత వాహనాల వల్ల కలిగే పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడమే పాలసీ ప్రధాన లక్ష్యం. త్వరలోనే నూతన వెహికల్ స్క్రాపేజ్‌ పాలసీకి సంబంధించిన ఆదేశాలను రాష్ట్రాలకు ఇవ్వనుంది కేంద్రం.