Gujarat : చెత్త లారీలో వెంటిలేటర్ల తరలింపు

కేసులు పెరుగుతున్న క్రమంలో..వెంటిలేటర్ల సమస్య ఏర్పడుతోంది. వెంటిలెటర్లను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వల్పాడ్ పట్టణం నుంచి సూరత్ లోని సివిల్ ఆసుపత్రికి 34 వెంటిలేటర్లను తరలించాలని నిర్ణయించారు.

Gujarat : చెత్త లారీలో వెంటిలేటర్ల తరలింపు

Ventiltors

Ventilators : కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రతి రాష్ట్రంలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రభుత్వాలు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయితే..అక్కడకక్కడ కొంత నిర్లక్ష్య ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కరోనా వైరస్ బారిన పడిన రోగులకు ఉపయోగించే వెంటిలెటర్లను చెత్తను తరలించే వాహనాల్లో తరలించడం వివాదాస్పదమైంది. వేరే వాహనాలు లేవా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వ్యకం చేస్తున్నారు. ఈ ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

గుజరాత్ రాష్ట్రంలో కూడా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేసులు పెరుగుతున్న క్రమంలో..వెంటిలేటర్ల సమస్య ఏర్పడుతోంది. వెంటిలెటర్లను తీసుకొచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. వల్పాడ్ పట్టణం నుంచి సూరత్ లోని సివిల్ ఆసుపత్రికి 34 వెంటిలేటర్లను తరలించాలని నిర్ణయించారు. సూరత్ మున్సిపాల్టీ నుంచి ఓ చెత్త లారీని తీసుకొచ్చారు. అందులో 34 వెంటిలేటర్లను ఉంచి ఆసుపత్రికి పంపించారు. ఇది చూసిన జనం నోరెళ్లబెట్టారు. ఎంతో జాగ్రత్తగా తరలించాల్సిన వెంటిలేటర్లను చెత్త లారీలో తరలిస్తారా ? అంటూ ప్రశ్నలు కురిపిస్తున్నారు. రోడ్డుపై వెళుతున్న వారు..ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

ఇక గుజరాత్ రాష్ట్రంలో కరోనా కేసుల విషయానికి వస్తే…గత 24 గంటల్లో 3 వేల 280 కొత్త కేసులు వెలుగు చూశాయి. రెండు వేల 167 మంది డిశ్చార్జ్ అయ్యారు. 17 మంది చనిపోయారు. రాష్ట్రంలో మొత్తం లక్షా 73 వేల 348 యాక్టివ్ కేసులుండగా 171 మంది వెంటిలెటర్ పై చికిత్స పొందుతున్నారు. 70 లక్షల 38 వేల 445 మంది మొదటి కరోనా టీకా తీసుకున్నట్లు, 8 లక్షల 47 వేల 185 మంది రెండో కరోనా టీకా వేయించుకున్నారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. 2 లక్షల 75 వేల 777 మంది 60 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సున్న వారు మొదటి డోస్, 45 నుంచి 60 సంవత్సరాల వయస్సున్న వారు 29 వేల 886 మంది రెండో సారి కరోనా టీకా వేయించుకున్నారని తెలిపింది.