కరోనాపై పోరు..ఢిల్లీలో ఆవు పిడకల ఫ్లాంట్ ఏర్పాటు చేయనున్న వీహెచ్ పీ

ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వల్ల చనిపోయిన వారిని దహనం చేయడానికి కట్టెల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే.

కరోనాపై పోరు..ఢిల్లీలో ఆవు పిడకల ఫ్లాంట్ ఏర్పాటు చేయనున్న వీహెచ్ పీ

Cow Dung Cakes

VHP to set up plant to make cow dung cakes in Delhi ఢిల్లీ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో కరోనా వల్ల చనిపోయిన వారిని దహనం చేయడానికి కట్టెల కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో కట్టెల కొరత తీర్చడానికి ప్రత్యామ్నాయంగా పిడకలను తయారు చేయాలని విశ్వహిందూ పరిషత్​ నిర్ణయించుకుంది. ఇందుకోసం ఢిల్లీలోని రోహిణి క్యాంప్​ సమీపంలో పిడకలు(ఆవు పేడ మాత్రమే) తయారు చేసే ప్లాంటునే నిర్మించ తలపెట్టింది. ఆవు పేడతో భారీ స్థాయిలో పిడకలు తయారు చేయించి.. కరోనాకు బలైన వారి మృతదేహాల అంత్యక్రియల కోసం అందించనున్నట్లు వీహెచ్ పీ తెలిపింది.

కరోనా మృతులకు దహన సంస్కారాలు చేయాలంటే కట్టెలు దొరకటం లేవు. ఒక వేళ దొరికినా వేల రూపాయలకు అమ్ముతున్నారు. పేద వారు అంత డబ్బుపెట్టి కొనలేరు. అందుకే మేము పిడకల్ని తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించున్నాం. వీటివల్ల కాలుష్యం తక్కువ.. ఖర్చు కూడా తక్కువేనని విశ్వహిందూ పరిషత్​ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు కపిల్​ ఖన్నా తెలిపారు. తమ ప్లాంట్​లో తయారు చేసిన పిడకలను ఢిల్లీలోని శ్మశాన వాటికలకు పంపించనున్నట్లు విశ్వహిందూ పరిషత్​ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు కపిల్​ ఖన్నా తెలిపారు. మొదటి ప్లాంట్​ను పాకిస్థాన్​ నుంచి శరణార్థులుగా వచ్చిన వారు ఉంటున్న ఢిల్లీలోని రోహిణి క్యాంప్​ సమీపంలో పెడతామని తెలిపారు. ఇందుకు అవసరమైన సామగ్రిని గుజరాత్​లోని భావ్​నగర్​ నుంచి తెప్పిస్తున్నట్లు చెప్పారు.