Vi Prepaid Plan : వొడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్.. రోజువారీ డేటాపై పరిమితి లేదు

కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు టెలికం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్లు, ఆఫర్లు తీసుకొస్తున్నాయి. తాజాగా వీఐ(వొడాఫోన్ ఐడియా) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే రూ.447 ప్లాన్.

Vi Prepaid Plan : వొడాఫోన్ ఐడియా సరికొత్త ప్లాన్.. రోజువారీ డేటాపై పరిమితి లేదు

Vi Prepaid Plan

Vi Prepaid Plan : కస్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు టెలికం కంపెనీలు కొత్త కొత్త ప్లాన్లు, ఆఫర్లు తీసుకొస్తున్నాయి. తాజాగా వీఐ(వొడాఫోన్ ఐడియా) సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. అదే రూ.447 ప్లాన్. ఈ ప్లాన్ ద్వారా 50 జీబీ డేటాను అందించనున్నారు. అంతేకాదు రోజువారీ డేటాపై ఎటువంటి పరిమితీ లేదు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ కూడా ఇటీవలే ఈ తరహా ప్లాన్లు లాంచ్ చేశాయి. ఎయిర్ టెల్ కూడా ఇవే లాభాలతో రూ.456 ప్లాన్ లాంచ్ చేసింది. దీని ద్వారా కూడా 50 జీబీ డేటా లభించనుంది.

* వీఐ కొత్త రూ.447 ప్లాన్ ద్వారా 50 జీబీ బల్క్ డేటాను అందించనుంది.
* రోజువారీ డేటా పరిమితి ఏమీ లేదు.
* ఈ ప్లాన్ ద్వారా అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్ అందించనున్నారు.
* ఈ ప్లాన్ వ్యాలిడిటీ 60 రోజులు.
* దీంతోపాటు వీఐ మూవీస్ యాక్సెస్ కూడా లభించనుంది. ఇందులో ఒరిజినల్ కంటెంట్, లైవ్ టీవీ, న్యూస్ కంటెంట్‌ను కూడా యాక్సెస్ చేయవచ్చు.
వీఐ యాప్‌లో ఈ ప్యాక్‌ను చూడవచ్చు.

జియో కూడా ఇదే ధరలో ఇవే లాభాలను అందించనుంది. 50 జీబీ డేటా తర్వాత ఈ డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోనుంది. అలాగే జియో రూ.447 ప్రీపెయిట్ ప్లాన్ ద్వారా జియో టీవీ, జియో సినిమా, జియో సినిమా, జియో న్యూస్, జియో సెక్యూరిటీ, జియో క్లౌడ్‌కు యాక్సెస్ లభించనుంది.

ఇక జియో రూ.447 ప్లాన్‌కు పోటీగా.. ఎయిర్ టెల్ కూడా రూ.456 ప్లాన్ లాంచ్ చేసింది. జియో, వొడాఫోన్ రూ.447 ప్లాన్ల తరహాలోనే ఈ ప్లాన్ లాభాలు ఉండనున్నాయి. రోజువారీ డేటాపై ఎటువంటి పరిమితీ లేదు. ఎయిర్ టెల్ అదనంగా అమెజాన్ ప్రైమ్ వీడియో మొబైల్ ఎడిషన్ కూడా లభించనుంది.